ETV Bharat / offbeat

యాపిల్​ను నేరుగా తినడమే కాదు - డైలీ ఇలా తీసుకున్నా మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి! - Apple Health Benefits - APPLE HEALTH BENEFITS

Apple Health Benefits: యాపిల్ పండు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, యాపిల్​ను నేరుగా తినడం మాత్రమే కాదు డైలీ ఇలా తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Health Benefits of Apple Juice
Apple Juice Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Aug 26, 2024, 1:25 PM IST

Health Benefits of Apple Juice: ఆరోగ్యాన్నిచ్చే పండ్లు అనగానే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేవి.. యాపిల్స్. అంతేకాదు.. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి పండ్లు తీసుకెళ్లేవారు ఎవరైనా సరే మొదటగా ఈ పండ్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి యాపిల్స్​లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, యాపిల్​ను(Apple) డైరెక్ట్​గా తినడం మాత్రమే కాదు.. రోజూ జ్యూస్ రూపంలో తీసుకున్నా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, డైలీ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయి? ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పోషకాల పవర్ హౌస్ : అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే యాపిల్​ను సూపర్ ఫుడ్​గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ పండులో సి, బి, కె -విటమిన్లు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాపర్​తో పాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, యాపిల్ పండు డైరెక్ట్​గా తిన్నా, జ్యూస్ చేసుకొని డైలీ తాగినా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..

జీర్ణ సమస్యలకు చెక్ : డైలీ యాపిల్ జ్యూస్ తాగడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యాపిల్​లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.

మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : యాపిల్​లో విటమిన్​ సితో(National Library of Medicine రిపోర్టు) పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, డైలీ యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్​ఫెక్షన్లు, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

మీరు యాపిల్‌ పండ్లని పొట్టు తీసి తింటున్నారా? - అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

గుండె ఆరోగ్యానికి మేలు : డైలీ యాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యాపిల్​లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, పీచు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెబుతున్నారు. అలాగే యాపిల్ జ్యూస్​లో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించే గుణాలు ఉంటాయంటున్నారు. అదేవిధంగా రక్తపోటును(Blood Pressure) కంట్రోల్​లో ఉంచుకోవడానికి ఇందులోని పోషకాలు సహాయపడతాయంటున్నారు.

2019లో "బ్రిటీష్ మెడికల్ జర్నల్​"లో ప్రచురితమైన అధ్యయం ప్రకారం యాపిల్ జ్యూస్​ను క్రమం తప్పకుండా తాగడం వల్ల కార్డియోవాస్క్యులర్ ప్రమాదాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అట్లాంటలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లో ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ Quan Yang పాల్గొన్నారు. యాపిల్​ జ్యూస్​ తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది : వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి యాపిల్ జ్యూస్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. దీనిలో ఉండే ఆధిక ఫైబర్​తో పాటు మరికొన్ని పోషకాలు బరువు తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతాయని చెబుతున్నారు.

బాడీని హైడ్రేటెడ్​గా ఉంచుతుంది : డైలీ శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకు డైలీ యాపిల్ జ్యూస్ తాగడం చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఎందుకంటే.. యాపిల్​లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే.. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో ఇందులోని పోషకాలు చాలా బాగా సహాయపడుతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే యాపిల్​ జ్యూస్​ మంచిది కదా అని బయట మార్కెట్లో లభించే వాటిని తాగడం కన్నా ఇంట్లో చేసుకుని తాగడమే మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రెడ్ యాపిల్ Vs గ్రీన్ యాపిల్ - డయాబెటిస్ పేషెంట్స్​కు ఈ రెండింటిలో ఏది మంచిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.