ETV Bharat / offbeat

'కల్తీ కారం తింటే క్యాన్సర్​ వచ్చే అవకాశం' - మీ ఇంట్లో వాడే చిల్లీ పౌడర్​ని ఇలా టెస్ట్ చేయండి! - CHILLI POWDER ADULTERATION TEST

-మిర్చి తొడిమలు, తుక్కు కాయలతో నకిలీ కారం తయారీ -ఇలా టెస్ట్​ చేస్తే కల్తీ కారం గుర్తుపట్టొచ్చు

Adulteration Chilli Powder
Adulteration Chilli Powder (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 4:51 PM IST

Adulteration Chilli Powder : ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు దాదాపు అన్నీ కల్తీ అవుతున్నాయి. మార్కెట్లో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. కొంతమంది అక్రమ మార్గాల్లో డబ్బులు ఎక్కువగా సంపాదించాలన్న ఉద్దేశంతో కల్తీ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే, ఇటీవల మార్కెట్లో ఎక్కువగా డిమాండ్​ ఉన్న కారాన్ని అక్రమార్కులు కల్తీ చేసి అమ్ముతున్నారు. నకిలీ కారం వంటల్లో ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంట్లోనే నకిలీ కారాన్ని గుర్తించడానికి 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)' కొన్ని సూచనలు చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కల్తీ కారం ఇలా చేస్తున్నారు : అక్రమార్కులు మిర్చి తొడిమలు, తుక్కు కాయలు, తాలుకాయలు, వర్షానికి తడిసి రంగు మారి చీడపీడలతో దెబ్బతిన్న మిరపకాయలను వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి.. ఆ తర్వాత వీటన్నింటినీ పొడిగా చేస్తారు. అనంతరం ఆ పొడికి రంగులు జోడిస్తారు. చివరిగా ఆకర్షణీయమైన సంచుల్లో నింపి మార్కెట్‌లోకి తెస్తుంటారు.

కారంలో ఇటుకపొడి కలిపితే ఇలా గుర్తుపట్టవచ్చు : కొంతమంది కారంలో ఇటుకపొడి కలిపి నకిలీ కారం తయారు చేస్తున్నారు. దీనిని గుర్తించడానికి FSSAI ఒక చిట్కా సూచించింది. అదేంటంటే.. ఒక చిటికెడు కారం పొడిని అర చేతిలో వేసుకోవాలి. కారంపై కొన్ని నీటి చుక్కలు చల్లి.. చేతితో రుద్దాలి. కారంలో ఇటుకపొడి కలిపితే.. వేలికి, చేతికి గరుకుగా చిన్న రాళ్లు తగిలినట్లుగా అనిపిస్తుంది. ఇలా ఉంటే కారం కల్తీ అయినట్లు. అలాగే కారాన్ని చేతిలో వేసుకుని నీళ్లు పోసి రుద్దినప్పుడు కాస్త నురగ వస్తే అందులో సబ్బు కణాలు కలిసినట్లు గుర్తించాలంటున్నారు.

నాసిరకం కారం గుర్తుపట్టడానికి : కారం మంచి రంగులో కనిపించడానికి కొంతమంది అందులో రంగులు కలిపి అమ్ముతుంటారు. ఇటువంటి కారం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ విధంగా ఉండే కారాన్ని గుర్తించడానికి గాజు గ్లాసు చిట్కా బాగా పని చేస్తుంది. ఇందుకోసం గాజు గ్లాసు నీటిలో టీస్పూన్​ కారం వేయాలి. నాణ్యమైన కారం నీటిపైన కొద్దిసేపు తేలి ఉంటుంది. నీరు రంగు మారకుండానే కారం మెల్లిగా కింద పడిపోతుంది. కానీ, అదే నకిలీ కారం నీటిని ఎరుపు రంగులోకి మారుస్తుంది. అలాగే కారం త్వరగా నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఈ విధంగా ఇంట్లోనే నకిలీ కారాన్ని గుర్తించవచ్చు.

నకిలీ కారంతో పలు అనారోగ్య సమస్యలు : ఆర్టిఫీషియల్​ కలర్స్​, కెమికల్స్​తో కల్తీ అయిన కారం.. వంటలకు ఉపయోగించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారంతో చేసిన ఆహారం జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని.. దీనిని వాడడం వల్ల దీర్ఘకాలంలో అల్సర్లు, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే అన్నవాహిక, జీర్ణాశయంలో పూతలు వచ్చి పుండ్లు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్నాళ్లపాటు నకిలీ కారం వాడితే క్యాన్సర్‌కూ దారి తీయొచ్చట. స్కిన్​ ప్రాబ్లమ్స్​ కూడా వస్తాయని.. నరాల వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దివాళీకి జీడిపప్పు కొంటున్నారా? - నకిలీని ఇలా గుర్తుపట్టండి బాస్​!

అలర్ట్​: మీరు ఉపయోగించే మసాలాలు స్వచ్ఛమైనవేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.