How to Leave Toxic Relationship : ప్రేమికులు, దంపతుల మధ్యలో ఒక్కొసారి గొడవలు, భేదాభిప్రాయాలు సహజమే. అయితే, ఇలాంటి గొడవలు తరచూ జరుగుతున్నా, మీ భాగస్వామి మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నా... ఆ బంధం ప్రమాదకరంగా మారుతోందంటున్నారు నిపుణులు. మీ భాగస్వామిలో కనిపించే కొన్ని లక్షణాలు, వారి ప్రవర్తన తీరు ఆధారంగా ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చని సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీ భాగస్వామి కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో మనపై మనమే నమ్మకం కోల్పోయేలా చేస్తారు. మనల్ని బలహీనులుగా మార్చుతారు. చెప్పాలంటే అన్ని రకాలుగా మనల్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దాకా వాళ్లు నిద్రపోరు. దీన్నే 'గ్యాస్‌లైటింగ్'గా పేర్కొంటున్నారు మానసిక నిపుణులు.
- ప్రతి చిన్న విషయంలో అబద్ధాలు ఆడడం వేధించే భాగస్వామిలో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణలు చెబుతున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తుంటారని, అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు.
- చిన్న చిన్న విషయానికే చిరాకు పడడం, అరవడం, కోప్పడడం.. లాంటివి వీరి ప్రవర్తనలో ఎక్కువగా గమనించచ్చు.
- ఇలాంటి వారు శారీరకంగా, మానసికంగానే కాకుండా.. భాగస్వామి భావోద్వేగాల పైనా దెబ్బకొడుతుంటాలని చూస్తారట. అందుకే భాగస్వామి మాటలు, చేతల్ని బట్టి వారి హింసాత్మక ధోరణిని పసిగట్టచ్చంటున్నారు నిపుణలు.
- మీపై అసూయ, ద్వేషాల్ని పెంచుకుంటారు. ఇలాంటి వాళ్లకు మీరు చేసే పనులతో పాటుగా మీరు మాట్లాడే మాటలు రుచించవట! మీది తప్పన్నట్లుగా, వారు చెప్పేదే కరక్ట్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. వాళ్ల ప్రవర్తనతో మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు.
- అనుబంధంలో మొదట మీతో బాగానే వ్యవహరిస్తారు. మీపై చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. కానీ రాన్రానూ మీపై ప్రేమ తగ్గిపోవడం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మీ ఫోన్ కాల్స్ /సందేశాలకు స్పందించకపోవడం లాంటి అంశాలు ప్రమాద సూచికలే అని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
- ఆరోగ్యకరమైన బంధంలో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడాలు అనేవి ఉంటాయి. కానీ మిమ్మల్ని వేధించాలని చూసే భాగస్వామి ఏ విషయంలోనూ రాజీ పడరని నిపుణులు అంటున్నారు. అలాంటి వారు మీతో ఏకీభవించరని, వాళ్ల మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తారని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- అందుకే ఒక వ్యక్తితో బంధాన్ని ఏర్పరచుకునే ముందు... వారికి ఫ్రెండ్స్ సర్కిల్ ఉందో, లేదో చూసుకోవడము కూడా కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, తనకు స్నేహితులు లేరంటే తన వ్యక్తిత్వం అంత మంచిది కాకపోవచ్చనడానికి ఓ సంకేతమని అనుమానించడంలోనూ తప్పు లేదంటున్నారు నిపుణులు. ముందు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసి కమిట్ అయినప్పటికీ ఆ తర్వాత జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు.
- 'అనుమానం పెనుభూతం!' అంటారు పెద్దలు. అయితే, వేధించే భాగస్వామిలో ఇలా అనుమానం ఎక్కువగా కనిపిస్తుందట. అందుకే ప్రతి విషయంలో మిమ్మల్ని అనుమానించడం, మీ ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం.. వంటివీ ఆమోదయోగ్యం కాని అంశాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart
ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు- మీరు ట్రై చేస్తారా? - Yoga for Stress Relief