ETV Bharat / international

'తూచ్​ మేం అలా అనలేదు! భారత్‌పై బైడెన్‌కు చాలా గౌరవం'- వైట్​హౌస్​ క్లారిటీ - White House On Biden Statement - WHITE HOUSE ON BIDEN STATEMENT

White House On Biden Statement : విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌, జపాన్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. మిత్ర దేశాలతో అమెరికాకు బలమైన సంబంధాలున్నాయని తెలిపింది. బైడెన్ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాలని పేర్కొంది.

Indian PM Narendra Modi And US President Joe Biden
Indian PM Narendra Modi And US President Joe Biden (ANI PHOTO)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 10:35 AM IST

Updated : May 3, 2024, 11:43 AM IST

White House On Biden Statement : భారత్‌, జపాన్​ను తక్కువ చేసేలా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన వేళ వైట్​హౌస్ వివరణ ఇచ్చింది. బైడెన్​కు భారత్, జపాన్ దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందని తెలిపింది. అధ్యక్షుడి వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని పేర్కొంది.

భారత్, జపాన్​పై బైడెన్ వ్యాఖ్యలు
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం వ్యాఖ్యానించారు. రష్యా, చైనా, జపాన్​లదీ అదే పరిస్థితి అన్నారు. అవి వలసదారులను ఎంతమాత్రమూ ఆహ్వానించవని పేర్కొన్నారు. అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అందుకు భిన్నంగా యూఎస్ విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని, వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటం వల్ల శ్వేతసౌధం దిద్దుబాటు చర్యలను చేపట్టింది.

"మా మిత్రదేశాలు, భాగస్వాములకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎంత గౌరవిస్తారో బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో వివరించారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాలి. జపాన్‌, భారత్‌ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశాం. భిన్నత్వమే అమెరికాను బలపరుస్తోందని బైడెన్‌ విశ్వసిస్తున్నారు. అందుకే వలసదారుల దేశంగా అమెరికా గుర్తింపు పొందడం మా దేశానికి చాలా ప్రయోజనం"

--కరీన్‌ జీన్‌ పియర్‌, శ్వేతసౌధం అధికార ప్రతినిధి

అధ్యక్ష ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం
యూఎస్ రాజకీయాల్లో వలస విధానం కీలక అంశంగా మారింది. ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2021 నుంచి ఏటా సగటున 20 లక్షల మంది సరిహద్దుల నుంచి అమెరికాలోకి చొరబడుతున్నారని అంచనా ఉంది. దీన్ని నివారించడానికి బైడెన్‌ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు పోల్స్‌లో తెలుస్తోంది. అంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పైనా వలస విధానంపై విమర్శలు వచ్చాయి. మళ్లీ 2024 నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.

గోల్డీ బ్రార్‌ బతికే ఉన్నాడు- అవన్నీ రూమర్లే : అమెరికా పోలీసులు - Goldy Brar US Incident

లోయలో పడ్డ బస్సు- 20మంది దుర్మరణం- అనేక మందికి తీవ్ర గాయాలు - Pakistan Accident Today

Last Updated : May 3, 2024, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.