ETV Bharat / international

మాజీ అధ్యక్షుడిని కాపాడిన 50పేజీల స్పీచ్ పేపర్లు​- బుల్లెట్​ తగిలినా ఆగని ప్రసంగం! - US Elections - US ELECTIONS

US Presidential Election Candidate : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి హత్యకు గురైతే ఎలా? నెక్ట్స్ ఏం జరుగుతుంది? తదుపరి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ? అనే దానిపై ఇప్పుడు అంతటా డిస్కషన్ జరుగుతోంది. ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో యావత్అమెరికా ఉలిక్కిపడింది. ట్రంప్ త్వరగా కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

US Presidential Election Candidate
US Elections (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 2:55 PM IST

US Presidential Election Candidate : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి ఏమైనా జరిగితే పరిస్థితేంటి? ఒకవేళ ఆయన హత్యకు గురైతే ఏం చేస్తారు? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం వల్ల అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆకస్మికంగా మరణిస్తే ఈ రూల్స్!
వాస్తవానికి అమెరికా అధ్యక్ష అభ్యర్థి హత్యకు గురైతే సంబంధిత రాజకీయ పార్టీలు ఏం చేయాలి ? అనే దానికి సంబంధించిన ప్రత్యేక నియమాలు ఏవీ లేవు. కానీ అధ్యక్ష అభ్యర్థి ఆకస్మికంగా మరణిస్తే ఏం చేయాలనే దానిపై గైడ్ లైన్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రకారం, అమెరికాలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రిపబ్లికన్, రెండోది డెమొక్రటిక్. ఈ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు దాదాపు ఏడాది పాటు పెద్ద ప్రక్రియనే నిర్వహిస్తాయి.

తొలుత అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ తరఫున ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తాయి. వాటిలో నెగ్గే వారికి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. అధ్యక్ష అభ్యర్థి మరణించే సమయానికి ప్రైమరీలు ఇంకా నిర్వహించకపోయి ఉంటే కొత్త అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేయాలి. అప్పటివరకు నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల ఈవెంట్లను మళ్లీ నిర్వహించేందుకు రెడీ కావాలి. ఒకవేళ ప్రైమరీ ఎన్నికలన్నీ పూర్తయి, అప్పటికే అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసి ఉంటే నేరుగా కొత్త అభ్యర్థి పేరును ప్రకటించే అధికారాన్ని సదరు పార్టీ కలిగి ఉంటుంది. ఈవిషయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల నిబంధనలు కొంత భిన్నంగా ఉంటాయని పరిశీలకులు అంటున్నారు.

విజయపథంలోనే ట్రంప్!
రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనే పట్టుదలతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన సర్వశక్తులను ఒడ్డుతూ ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించడంతో మిగతా అభ్యర్థులంతా పోటీ నుంచి నిష్క్రమించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డిబేట్‌లోనూ ట్రంప్ పైచేయి సాధించారు. దీంతో ఎలాన్ మస్క్ లాంటి అపర కుబేరులు సహా ఎంతోమంది అమెరికా సంపన్న వ్యాపార దిగ్గజాలు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి భారీ విరాళాలను అందిస్తున్నారు. కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంపే అని సర్వేలన్నీ కోడై కూస్తున్న వేళ ట్రంప్ లక్ష్యంగా దాడి జరిగింది. జులై 13న సాయంత్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తుండగా తుపాకీ కాల్పుల మోత మోగింది. ఓ బుల్లెట్ వచ్చి ట్రంప్ కుడి చెవి ఎగువ భాగంలో తాకింది. దీంతో చెవి నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

2017లో ట్రంప్‌పై దాడికి పన్నాగం!
2017 సంవత్సరంలో ఫిలిప్పీన్స్‌లో ఆసియాన్ సదస్సు జరిగింది. అందులో పాల్గొనేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెళ్లారు. ఆ సందర్భంగా ట్రంప్‌పై దాడికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ISIL) అనుబంధ సంస్థ ప్లాన్ చేసిందని అమెరికా సీక్రెట్ సర్వీస్ గుర్తించింది. ఆ కుట్రను విజయవంతంగా భగ్నం చేసింది.

1912లో టెడ్డీ రూజ్‌వెల్ట్ ఛాతీలోకి బుల్లెట్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం వేళ ఈవిధంగా దాడుల బారినపడటం ఇదే తొలిసారేం కాదు. 1912లో మాజీ ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్‌వెల్ట్ మిల్వాకీలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆయన చొక్కా జేబును చీల్చుకుంటే ఛాతీ కుడి వైపు భాగంలోకి దూసుకెళ్లింది. మంచి మెడికల్ నాలెడ్జ్ ఉన్నందున తన ఊపిరితిత్తుల్లోకి బుల్లెట్ వెళ్లలేదని, అది ఛాతీ పైపొరలోపలే ఉందని రూజ్‌వెల్ట్ అంచనా వేశారు. అందుకే వెంటనే ఆస్పత్రికి వెళదామని పార్టీ కార్యకర్తలు చెప్పినా ఆయన వినిపించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. రూజ్‌వెల్ట్ జేబులో 50 పేజీల ప్రసంగంతో కూడిన బుక్ లెట్ ఉండటం వల్ల బుల్లెట్ దానికి తాకి నెమ్మదిగా శరీరంలోకి ప్రవేశించింది. ఫలితంగా అది ఊపిరితిత్తుల దాకా వెళ్లలేకపోయింది. ఈ ఒక్క కారణమే ఆనాడు రూజ్‌వెల్ట్ ప్రాణాలను నిలిపింది. అయితే ఛాతీ నుంచి ఆ బుల్లెట్‌ను తీస్తే ప్రాణాలకు అపాయమని డాక్టర్లు గుర్తించారు. దీంతో 1919లో చనిపోయే వరకు ఆ బుల్లెట్ రూజ్‌వెల్ట్ శరీరంలోనే ఉండిపోయింది.

1968లో రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ హత్య
1968 జూన్ 6న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెనెడీపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన ముష్కరుడు దొరికాడు. ఆ మరుసటి రోజున కెనెడీ మరణించినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి ప్రకటన వెలువడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.