ETV Bharat / international

జోరు మీదున్న అమెరికా- ఏడాదిలో భారతీయులకు 14లక్షల వీసాలు జారీ

Us Visa Record In India : 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అలానే వీసా కోసం నిరీక్షణ సమయాన్ని 75 శాతం మేర తగ్గించామని పేర్కొంది.

Us Visa Record In India
Us Visa Record In India
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 7:06 AM IST

Us Visa Record In India : 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అన్ని వీసా విభాగాల్లో డిమాండ్ భారీగా ఉందని వెల్లడించింది. 2022తో పోలిస్తే గతేడాది భారతీయుల వీసా దరఖాస్తుల్లో 60 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది అగ్రరాజ్య వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారతీయులేనని పేర్కొంది. విజిటర్‌ వీసా అపాయింట్‌మెంట్‌ వేచి చూసే సమయాన్ని 75 శాతం (సగటున 1000 రోజుల నుంచి 250కి) తగ్గించినట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

అత్యధికంగా భారతీయ విద్యార్థులే
భారత్‌లోని అమెరికా దౌత్య బృందం 2023లో 1.40 లక్షలకుపైగా విద్యార్థి వీసాలు జారీ చేసి వరుసగా మూడో ఏడాది రికార్డు సృష్టించింది. మరే దేశంలోనూ ఈ స్థాయిలో జారీ చేయలేదని అమెరికా తెలిపింది. విద్యార్థి వీసా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌, చెన్నైలు ప్రపంచంలోనే మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తోన్న పది లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థుల్లో నాలుగింట ఒకవంతు భారతీయులే ఉన్నారని పేర్కొంది. అలానే భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం గతేడాది 3.80 లక్షల ఉద్యోగ వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. విజిటర్‌ వీసాల(బీ1/బీ2)కు సంబంధించి మొత్తం 7 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఆలస్యమైన 31 వేలకుపైగా వలస వీసా దరఖాస్తులను ముంబయిలోని కాన్సులేట్ జనరల్ పరిష్కరించినట్లు అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

2023 మార్చిలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యకలాపాలను స్థానికంగా 340 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన సొంత భవనంలోకి మార్చారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌, బెంగళూరులో కొత్త కాన్సులేట్‌లను ప్రకటించారు. వినూత్న సాంకేతిక పరిష్కారాలు, సిబ్బంది పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, మరిన్ని నిధుల కేటాయింపు వంటి చర్యల ద్వారా భారతీయుల వీసా డిమాండ్‌లను తీర్చినట్లు అమెరికా రాయబార కార్యలయం తెలిపింది. 2024లో హెచ్‌1బీ వీసాల రెన్యువల్‌ ప్రక్రియను తమ పైలట్ కార్యక్రమం మరింత సులభతరం చేస్తుందని పేర్కొంది.

H1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అమెరికాలోనే వీసా రెన్యువల్‌!

కెనడా షాకింగ్​ నిర్ణయం!- స్టూడెంట్ వీసా డిపాజిట్ డబుల్​- 20వేల డాలర్లకుపైగా ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.