ETV Bharat / international

అధ్యక్ష రేసులో బైడెన్, ట్రంప్ జోరు- మరో 4రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో విజయం - Us president elections 2024

Us Primary Elections : అమెరికాలో మంగళవారం జరిగిన మరో నాలుగు ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్, ట్రంప్ విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఇల్లినాయీస్, ఫ్లోరిడా, ఒహైయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో గెలిచారు.

Us Primary Elections
Us Primary Elections
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 6:45 AM IST

Updated : Mar 20, 2024, 9:48 AM IST

US Primary Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఖరారు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మంగళవారం జరిగిన ఇల్లినాయీస్, ఫ్లోరిడా, ఒహైయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు. అనంతరం మాట్లాడిన బైడెన్​, 2020లో తాను ట్రంప్​ను ఓడించడానికి లాటినో ఓటర్లే కారణమని చెప్పారు. 2020లో లాగా మళ్లీ ట్రంప్​ను ఓడించడానికి మీరు సహాయం చేయాలని లాటినో ప్రజలను కోరారు.

కొన్ని వారాల నుంచి ట్రంప్, బైడెన్ నవంబర్​లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారించారు. పలు రాష్ట్రాల్లో ర్యాలీలు, ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవలె ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావటం వల్ల ట్రంప్ బృందం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పింది.

రెండోసారి ఢీ
ఇక డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ తమ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి తలపడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రీమ్యాచ్​ జరగడం (వరుసగా రెండు సార్లు ఒకే అభ్యర్థులు పోటీ చేయడం) రెండోసారి. అంతకుముందు 1952 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున డ్వైట్​ డీజిన్​హవర్​, డెమొక్రాట్ల తరఫున అడ్లై స్టీవెన్​సన్​-2 పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డీజిన్​హవర్ భారీ విజయం సాధించారు. మళ్లీ 1956లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరే ప్రత్యర్థులగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థి డీజిన్​హవర్ గెలుపొందారు. మరి 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​, బైడెన్ ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్​ విజయం- అడుగు దూరంలో మూడో ప్రపంచ యుద్ధం అంటూ హెచ్చరిక!

పాలస్తీనాకు కొత్త ప్రధాని- అమెరికా ఒత్తిళ్లతో అధ్యక్షుడి నిర్ణయం

Last Updated : Mar 20, 2024, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.