ETV Bharat / international

నవంబర్​లో పోలింగ్ - జనవరిలో ప్రమాణ స్వీకారం- మూడు నెలల గ్యాప్​లో అమెరికాలో ఏమి జరుగుతుందో తెలుసా?

భారత్‌తో పోల్చుకుంటే అమెరికా ఎన్నికల విధానం ఎందుకంత భిన్నం? యూఎస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతారు? ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?

US Presidential Election Process
US Presidential Election Process (Getty Images, Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 23 hours ago

US Presidential Election Process In Telugu : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రపంపమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అక్కడి ఎన్నికలపై భారత్​లో కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే చాలా మంది మదిలో-భారత్‌తో పోల్చుకుంటే అమెరికా ఎన్ని కల విధానం ఎందుకంత భిన్నంగా ఉంటుంది అనే ప్రశ్న మెదులుతోంది. పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన భారత్‌లో ఎంపీలను ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఎంపీలు గెలిచిన పార్టీ లేదా కూటమి ప్రధానిని ఎన్నుకుంటాయి. మరోవైపు అమెరికాలో అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి 538 ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఉంటారు. వీరిని ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్ష పీఠం దక్కాలంటే ఎలక్టోరల్ కాలేజీలో 270 మంది మద్దతు అవసరం ఉంటుంది.

నేషనల్​ పాపులర్ ఓట్
అమెరికాలోని చాలా వరకు రాష్ట్రాలలో అత్యధిక మెజారిటీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. దీంతో నేషనల్ పాపులర్ ఓటు దక్కకపోయినా ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు భారత్‌లో ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. 545 లోక్‌సభ స్థానాల్లో 543 మందిని ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. మిగతా ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మెజారిటీ మార్క్ 272 సీట్లు దక్కిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతుంది.

ఎవరీ ఎలక్టర్లు?
అమెరికా ఎన్నికల్లో ప్రజలు ఎన్నికునేది ఎలక్టర్లనే. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం, సెనేట్​ ప్రాతినిధ్యం ఆధారంగా ఎలక్టోరల్​ కాలేజీ సభ్యుల సంఖ్య ఉంటుంది. ఈ ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో ఫలానా పార్టీ నేతలు, మద్దతుదారులను ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా పోటీ చేయడానికి పార్టీ నామినేట్ చేస్తుంది లేదా చర్చలు జరిపి పార్టీ సెంట్రల్ కమిటీ ఎన్నుకుంటుంది. రెండో భాగంలో- జనరల్ ఎలక్షన్స్​లో ఓటర్లు తమకు నచ్చిన అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టర్లకు ఓట్లు వేస్తారు. అయితే ఎన్నికల సమయంలో బ్యాలెట్​పై ఎలక్టర్ల పేరు ఉండొచ్చు, ఉండక పోవచ్చు. అది వివిధ రాష్ట్రాల ఎన్నికల విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫలితాల తర్వాత విన్నింగ్​ క్యాండిడేట్​ పార్టీ తరఫున పోటీ చేసిన ఎలక్టర్లు- రాష్ట్ర ఎలక్టర్లుగా అపాయింట్ అవుతారు. ఇది నెబ్రాస్కా, మైన్ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంది. ఎన్నికైన ఎలక్టర్లంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

41రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం
అమెరికా ఎన్నికల్లో ఎలక్టోరల్ సభ్యుల ఎన్నిక జరిగిన 41 రోజుల తర్వాత డిసెంబర్‌లో వారంతా అధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్‌లో పాల్గొంటారు. జనవరిలో ఆ ఓట్లను అమెరికా కాంగ్రెస్ అంటే పార్లమెంటు లెక్కించి అధ్యక్షుడిని ప్రకటిస్తుంది.

కానీ భారత్‌లో పోలింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏ పార్టీ అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలిచారనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. మెజారిటీ దక్కిన పార్టీ లేదా కూటమిని ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానిస్తారు. భారత్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజులకే ప్రభుత్వం ఏర్పడుంది.

అమెరికాలో ఈసారి నవంబర్‌ 5న పోలింగ్ జరగనుంది. విజయం సాధించినవారు ప్రమాణ స్వీకారం చేసేందుకు సుదీర్ఘం కాలం వేచి చూడాల్సి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన 11 వారాల తర్వాత జనవరిలో అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. అమెరికాలో ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు.

ప్రతిసారి నవంబర్​లోనే ఎన్నికలు ఎందుకు?
నవంబర్‌ తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది. దీని వెనక ఓ కారణం ఉంది. 1845కు ముందు అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒకేరోజు పోలింగ్‌ జరిగేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అమెరికా వ్యవసాయ ఆధారిత దేశం. నవంబర్‌ మొదట్లో పంట చేతికొచ్చి రైతులకు పనులు తక్కువగా ఉండటం వల్ల వారు ఓటు వేయడానికి వీలు లభించేది. దీనికితోడు వారు ప్రయాణించడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం ఓటింగ్‌ పెడితే క్రైస్తవులు ప్రార్థనల్లో ఉంటారు కాబట్టి వారు తక్కువగా పాల్గొంటారని అంచనా వేశారు. ఇక బుధవారం అప్పట్లో రైతులకు మార్కెట్‌ డేగా ఉండేది. వీటిని దృష్టిలో ఉంచుకుని మంగళవారం అనువైందిగా నిర్ణయించారు. అది కూడా నవంబర్‌ 1వ తేదీ మంగళవారం వస్తే పోలింగ్‌ నిర్వహించరు. నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే పోలింగ్‌ నిర్వహిస్తారు.

నవంబర్‌లో ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం గతంలో మార్చి 4 వ తేదీన ఉండేది. గ్రేట్‌ డిప్రెషన్ వల్ల ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఉన్న సమయాన్ని దాదాపు మూడు నెలలకు కుదించారు. ఎన్నిక నుంచి ప్రమాణస్వీకారం మధ్య దాదాపు మూడు నెలల వ్యవధి ఉండటానికి అధికార బదలాయింపులు కూడా కారణం. కొత్త అధ్యక్షుడు, ఆయన బృందం పాలనకు సిద్ధం కావడానికి ఈ సమయం ఇస్తారు.

భారత్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే సందడి నెలకొంటుంది. అమెరికాలో ఎన్నికలకు 9 నెలల ముందే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా పార్టీలు తమ కాకస్‌లు, ప్రైమరీల ద్వారా తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటాయి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో నిర్వహించే ఆయా పార్టీల జాతీయ సదస్సుల్లో అధ్యక్ష అభ్యర్థులను ప్రకటిస్తారు. నవంబర్‌లో ఓటింగ్ ముగిసిన రోజే విజేత ఎవరో దాదాపుగా ఖరారవుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే వారు నేచురల్ బోర్న్​ అమెరికాన్ సిటిజెన్ అయి ఉండాలి. దాంతో పాటు కనీస వయసు 31, కనీసం 14 ఏళ్లు అమెరికాలో నివాసం ఉండివారు అయి ఉండాలి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగోళ్ల డిమాండ్లు- ఎవరు గెలిచినా ఆ పనులు చేయాల్సిందేనట!

ప్రజల ఓట్లు ఎక్కువొచ్చినా అమెరికా అధ్యక్ష పీఠం గ్యారెంటీ లేదు! ఆ ఓట్లే ముఖ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.