ETV Bharat / international

అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధం - చివరి నిమిషంలో అధ్యక్ష అభ్యర్థుల హోరాహోరీ ప్రచారాలు - US ELECTION 2024

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధం - ముందస్తు ఓటింగ్​లో పాల్గొన్న 6.8 కోట్ల మంది అమెరికన్లు

US Election 2024
US Election 2024 (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 7:13 AM IST

US Election 2024 : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు మంగళవారం పోలింగ్‌ జరగనుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, మరోసారి అధికారం కోసం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. పోలింగ్​లో పాల్గొనేందుకు అమెరికా ఓటర్లు కూడా ఉత్సాహన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే ముందుగా ఓటేసే అవకాశాన్ని 6.8 కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకున్నారు.

ముందస్తు ఓటింగ్​కు అవే కారణం
ముందస్తు ఓటింగ్‌కు ఓటర్లు వెల్లువెత్తుతుండటం వల్ల గతంలో కంటే ఈసారి పోలింగ్‌ కేంద్రాలను పెంచాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని 42 బ్రాడ్‌వేలో ఉన్న బోర్డు ఆఫ్‌ ఎలక్షన్స్‌ కార్యాలయం ఈ ఏర్పాట్లలో బిజీగా ఉంది. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్‌ రికార్డు సృష్టించిందని, అది ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఒక్క న్యూయార్కే కాదు, అమెరికా అంతటా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇప్పటికే 6.8 కోట్ల మంది మెయిళ్లద్వారా, పోలింగ్‌ కేంద్రాల ద్వారా ఓటేశారు. గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో 100 ముందస్తు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి 50శాతం అధికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులు, పోలింగ్‌ రోజున భారీ క్యూలతో ఇబ్బందులు, ఎన్నికల రోజున ఘర్షణలు ముందస్తు ఓటింగ్‌కు కారణాలుగా భావిస్తున్నారు.

చివరి నిమిషంలో విశ్వ ప్రయత్నాలు
ఇక అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం ముగింపు దశలో ఉంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ తనకు అనుకూలమైన నార్త్‌ కరోలినాలో ప్రచారం చేస్తున్నారు. మంగళవారం వరకూ నార్త్‌ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు. న్యూమెక్సికో, వర్జీనియాలనూ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. నార్త్‌ కరోలినాలోని గ్యాస్తోనియా, ఛార్లెట్, గ్రీన్స్‌బరోల్లో శనివారం ప్రచారం చేశారు. మధ్యలో వర్జీనియాలోని సేలంలో ఆగారు. ఆదివారం కింగ్‌స్టన్‌లో ప్రచారం చేశారు. సోమవారం రాలేగ్‌లో ప్రచారంలో పాల్గొంటారు. దీంతో నార్త్‌ కరోలినాలోనే అక్టోబరు 1 నుంచి ఆయన 9 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ 6సార్లు ఈ రాష్ట్రాన్ని చుట్టారు.

మరోవైపు డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ నార్త్‌ కరోలినాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. శనివారం నార్త్‌ కరోలినాలోని ఛార్లెట్‌లో ప్రచారం చేశారు. సోమవారం తన భర్త డగ్‌ ఎంహాఫ్‌ను గ్రీన్‌విల్లేకు పంపుతున్నారు. తుపాను కారణంగా నార్త్‌ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు మొగ్గుతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. శుక్రవారానికల్లా నార్త్‌ కరోలినాలోని 78లక్షలమంది ఓటేశారు. ఇది మొత్తం ఓటర్లలో దాదాపు సగం. పత్రికలకు వ్యాసాలు రాయడం, టెలివిజన్‌ షోలలో హారిస్‌ పాల్గొంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.