ETV Bharat / international

కస్క్‌లో భీకరపోరు- తొలిసారి అంగీకరించిన జెలెన్​స్కీ- ఒకరిపైఒకరు పోటీగా! - Russia Ukraine War - RUSSIA UKRAINE WAR

Russia Ukraine War : ఉ‌క్రెయిన్‌తో సరిహద్దు కలిగిన రష్యాలోని కస్క్‌లో ఇరుదేశాల మధ్య పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టు, సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. అటు రష్యాకు చెందిన అనేక నౌకలు, సహజ వాయువు క్షేత్రాన్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కస్క్‌ ప్రాంతంలో తమ దళాలు ముందుకు దూసుకెళుతున్నాయని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి అంగీకరించారు.

Russia Ukraine War
Russia Ukraine War (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 3:30 PM IST

Russia Ukraine War : రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తొలిసారి రష్యా ప్రధాన భూభాగంలోకి దాదాపు 15 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులు చేసింది. దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్‌ నుంచి ఇప్పటికే అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు నాలుగు రోజులుగా ఇరు దేశాల మధ్య ఈ ప్రదేశంలోనే భీకరంగా దాడులు జరుగుతున్నాయి.

తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టు, సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. 22వ మెకనైజ్డ్‌బ్రిగేడ్‌కు చెందిన 15మంది కమాండర్లను చంపేందుకు వ్యూహాత్మక ఇస్కందర్ క్షిపణలను ఉపయోగించినట్లు వెల్లడించింది. కస్క్‌వైపు ఉక్రెయిన్ 1120 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ధ సామగ్రిని కోల్పోయిందని రష్యా పేర్కొంది. కస్క్‌నుంచి ఉక్రెయిన్‌బలగాలు మరింత ముందుకు చొచ్చుకెళ్లకుండా రష్యా బలగాలు నిరోధిస్తున్నాయని తెలిపింది. కస్క్‌ప్రాంతంలో ఉక్రెయిన్‌కు చెందిన 26 డ్రోన్‌లను నేలకూల్చినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌బలగాలు, యుద్ధ సామగ్రి లక్ష్యంగా SU-34 ఫైటర్‌జెట్‌బాంబులను జారవిడించిందని తెలిపింది.

Russia Ukraine War
కస్క్​ ప్రాంతంలో పరిస్థితులు ఇలా! (Associated Press)

అటు రష్యాకు చెందిన సహజ వాయువు క్షేత్రాన్ని, అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కస్క్‌ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి మీడియాకు తెలిపారు. తద్వారా రష్యాపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. కస్క్‌లో జరుగుతున్న దాడుల గురించి సైనిక ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ఒక మిలిటరీ గస్తీ బోట్‌సహా మూడు ఇతర నౌకలపై దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ నిఘా విభాగం తెలిపింది. రష్యా ఆధీనంలో ఉన్న సహజ వాయువు క్షేత్రంపై నావిక దళం సాయంతో దాడి చేశామని పేర్కొంది. అయితే ఈ దాడులపై రష్యా అధికారికంగా స్పందించలేదు.

మరోవైపు ఉక్రెయిన్‌లోని నగరాలపై కూడా రష్యా దాడులు చేస్తోంది. తాజాగా కీవ్‌ శివారు ప్రాంతంపై జరిపిన రష్యా క్షిపణి దాడిలో తండ్రి, కుమారులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర విభాగం తెలిపింది. కీవ్‌పై ఈ నెలలో ఇది రెండో దాడి అని కీవ్ నగర మిలిటరీ విభాగ అధిపతి తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణి కీవ్‌లోని శివారు ప్రాంతంపై పడిందని చెప్పారు. కీవ్‌వైపునకు దూసుకొచ్చిన డ్రోన్‌లను కూల్చివేశామని వెల్లడించారు.

'యుద్ధానికి ఇది సరైన సమయం కాదు- అక్కడ సమస్యలు పరిష్కారం కావు'- ప్రధాని మోదీ - PM Modi Austria Visit Updates

'శాంతి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ'- మోదీ, పుతిన్‌ హగ్​పై జెలెన్‌స్కీ తీవ్ర స్పందన - PM Modi Russia Visit

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.