ETV Bharat / international

కమలతో చర్చకు ట్రంప్ రె'ఢీ'- సెప్టెంబరు 10న మరో వాడీవేడీ డిబేట్! - Trump Harris Debate - TRUMP HARRIS DEBATE

Trump Harris Debate : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబరు 10న ఏబీసీ టీవీ ఛానల్​లో కమల హారిస్​తో చర్చకు తాను సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే మరో రెండు టీవీల్లో డిబేట్​లకు రావాలని కమలకు ప్రతిపాదించారు.

Trump Vs Harris
Trump-Harris debate (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 10:26 AM IST

Trump Harris Debate : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​తో డిబేట్​కు సిద్ధమని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 10న ఏబీసీ టీవీ ఛానల్​లో చర్చకు రెడీ అని తెలిపారు.

మూడు డిబేట్​లకు ప్రతిపాదన
సెప్టెంబరులో మూడు టీవీ ఛానళ్లలో డిబేట్​కు రావాలని కమలకు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించారు. సెప్టెంబరు 4, 10, 25 తేదీల్లో చర్చకు రావాలని ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. అందుకు హారిస్‌ అంగీకరిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, డొనాల్ట్ ట్రంప్ కమలతో డిబేట్ సిద్ధమైనట్లు ఏబీసీ టీవీ ఛానల్ ధ్రువీకరించింది. సెప్టెంబరు 10వ తేదీన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డిబేట్​లో పాల్గొంటారని ఒక ప్రకటనలో తెలిపింది.

"డిబేట్ ద్వారా వివాదాలు పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. మరోవైపు డిబేట్​లో నిబంధనలను కమల అంగీకరించాలి. ఆమె అందుకు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. కమలతో డిబేట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను డిబేట్ లో రికార్డును సెట్ చేయాలని భావిస్తున్నాను. వచ్చే నెలలో సీబీఎస్ న్యూస్ వైస్ ప్రెసిడెంట్ డిబేట్​ను నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేందుకు ముందుకొచ్చి నా రన్నింగ్ మేట్, ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ మంచి పనిచేశారు" అని డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

స్పందించిన కమల
మరోవైపు, సెప్టెంబర్‌ 10న ఏబీసీ టీవీ ఛానల్​లో చర్చకు రెడీ అని డొనాల్ట్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ఏబీసీ డిబేట్​లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఆలాగే డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబరు 10న డిబేట్​కు అంగీకరించినందుకు సంతోషిస్తున్నానని డెట్రాయిట్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మరోవైపు కమలా హారిస్ తన రన్నింగ్ మేట్, డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్ట్​తో కలిసి పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్​లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు.

నాడు టిమ్​ వాల్జ్​ను మెచ్చుకుంటూ - ఇప్పుడు కాదంటూ - ట్రంప్ భిన్న స్వరాలు! - Trump About Tim Walz

ఆగస్టు 26న స్పేస్‌ఎక్స్‌ 'పోలారిస్‌ డాన్‌' ప్రయోగం - చరిత్ర సృష్టిస్తుందా? - SpaceX Polaris Dawn

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.