Russia Ukraine War Zelensky : రష్యాతో జరుగుతున్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతిస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని చెప్పారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌కూ తెలుసు అని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే మరో ప్రపంచ యుద్ధం తప్పనిసరి అని అన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
జర్మనీ నుంచి టారస్ క్రూజ్ క్షిపణలు అందకపోవటంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాల బలహీనతలను తాను కూడా అర్థం చేసుకోగలనని తెలిపారు. అయితే యుద్ధం సమయంలో జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదు అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఉక్రెయన్ కోసం పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే ఉక్రెయిన్‌కు మద్దతిస్తారా అని ప్రశ్నించగా, అగ్రరాజ్య విదేశాంగ విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని వివరించారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని అన్నారు.
రష్యాపై ఉక్రెయిన్ దాడి
ఇటీవలే రష్యా భూభాగంలో ఉక్రెయిన్ జరిపిన దాడులు జరిపింది. ఈ ఘటనలో ఈ దాడిలో 14 మంది రష్యన్‌లు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 108 మందికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్‌కు సరిహద్దున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గొరోడ్‌లో ఈ దాడి జరిగినట్లు రష్యా ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పలు చిత్రాలు, వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఈ దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ కూడా విడుదల చేసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
122 క్షిపణులు, 36 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా- ఉక్రెయిన్‌తో యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదే!
క్రిమియాలో ఉక్రెయిన్ దూకుడు- రష్యా సైనిక నౌకపై క్షిపణి దాడి- ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం!