ETV Bharat / international

'అంతరిక్షంలోకి అణ్వాయుధాలకు వ్యతిరేకం- వాటిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నాం' - putin against nuclear weapons

Russia Nuclear Weapons : అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను పుతిన్ ఖండించారు.

Russia Nuclear Weapons
Russia Nuclear Weapons
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 11:59 AM IST

Russia Nuclear Weapons : అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు రష్యా పూర్తి వ్యతిరేకమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అణ్వస్త్ర ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను పుతిన్ ఖండించారు. అమెరికాకు సమానంగా అంతరిక్ష సామర్థ్యాలను మాత్రమే తమ దేశం అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.

రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో నిర్వహించిన సమావేశంలో పుతిన్- అమెరికా చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్ని రష్యా ఎప్పటికీ సమర్థించదని తెలిపారు. కొన్ని దేశాలు కావాలనే తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపించారు. అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు తమతో కలిసి నడవాలని పాశ్చాత్యదేశాలను ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించామని, కానీ కొన్నిదేశాలు ముందుకు రాలేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు.

రష్యా సీక్రెట్ ఆయుధం
ఇటీవలే రష్యా రహస్యంగా ఓ కీలక ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ వద్ద ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై నిజాలను బయటపెట్టాలని అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగాన్ని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్‌ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ టర్నర్‌ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి సామర్థ్యాన్ని రష్యా పొందిందని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉందని శ్వేతసౌథం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. ఈ అంశంపై మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.

వ్యోమగాములకు సైతం ప్రమాదం
అయితే తక్షణమే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ భూ కక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుందని జాన్​ కిర్బీ పేర్కొన్నారు. దిగువ కక్ష్యలో ఉండే వ్యోమగాములకు సైతం ఇది ప్రమాదకరమన్నారు. అంతరిక్షం నుంచి భూమిపై దాడి చేసే సామర్థ్యం ఆ ఆయుధానికి ఉందని మాత్రం చెప్పలేమని కిర్బీ అన్నారు. దీని తయారీని కొన్ని నెలల క్రితమే రష్యా ప్రారంభించిందన్నారు. రష్యా తయారు చేస్తున్న ఆయుధానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బైడెన్‌కు తెలియజేశామని చెప్పారు.

అమెరికా చేసిన ఈ ఆరోపణలపై రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌కు సాయం అందించడానికి అమెరికా కాంగ్రెస్‌ మద్దతు పొందేందుకు బైడెన్‌ సర్కారు ఈ ఉపాయం వేసినట్లు ఆరోపించింది. రష్యా వద్ద నిజంగా విధ్వంసక క్షిపణి ఉంటే అది అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.

పుతిన్ దోస్త్​ మేరా దోస్త్- ప్రపంచాన్ని ఎదురించి మరీ కిమ్​కు స్పెషల్ గిఫ్ట్

'నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు- రష్యా అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ప్రపంచానికి తెలిసింది!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.