ETV Bharat / international

పాక్​లో ఘోర ప్రమాదం- లోయలో బస్సు పడి 10 మంది మృతి - bus accident in pakistan

Pakistan Road Accident : పాకిస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. డ్రైవర్​ అతివేగంతో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

Pakistan Road  Accident
Pakistan Road Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 1:58 PM IST

Updated : Feb 28, 2024, 3:50 PM IST

Pakistan Road Accident : పాకిస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడం వల్ల మంగళవారం అర్థరాత్రి ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ ఘటన జరిగింది. అతివేగం కారణంగానే మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్లు చెప్పారు.

అతి వేగమే కారణం
హరిహరపుర్ జిల్లాలోని కొండప్రాంతమైన ఖాన్​పుర్ గ్రామం నుంచి బస్సు వస్తుండగా తర్నవాకు సమీపంలో ప్రమాదానికి గురైనట్లుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో హరిపుర్ జిల్లాలోని ట్రామా సెంటర్​కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని లోయలో పడ్డ బస్సు
కొన్నాళ్ల క్రితం పాకిస్థాన్​లో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 42 మంది మరణించారు. బలూచిస్థాన్​లోని లాస్బెలా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని అదుపు తప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. బస్సులోని 48 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్​ అంజా అంజుమ్​ తెలిపారు.

యూటర్న్ తీసుకుటుండగా ప్రమాదం
బస్సు క్వెట్టా ప్రావిన్స్​ నుంచి రాజధాని కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లాస్బెలా సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు యూ-టర్న్ తీసుకుంటుండగా వంతెన పిల్లర్‌ను ఢీకొని లోయలో పడి మంటలు అంటుకున్నాయని దీంతో 42 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని అంజా అంజుమ్​ వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

పాక్​లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

పాక్​లో ఘోర​​ ప్రమాదం.. గుంతలో బోల్తాపడ్డ వ్యాన్​.. 20 మంది భక్తులు దుర్మరణం

Last Updated : Feb 28, 2024, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.