ETV Bharat / international

విషాదం- లోయలో బోల్తా పడ్డ ట్రక్కు- ఒకే కుటుంబంలోని 14మంది మృతి - Accident Today - ACCIDENT TODAY

Pakistan Accident : రోడ్డుపై వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. పాకిస్థాన్​లో జరిగిందీ ప్రమాదం.

PAKISTAN ACCIDENT
Accident Today (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 4:53 PM IST

Updated : May 18, 2024, 6:58 PM IST

Pakistan Accident : పాకిస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరందరూ ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్ల పంజాబ్ ప్రావిన్స్​లో శనివారం జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని బన్నూ జిల్లా నుంచి పంజాబ్‌ లోని ఖుషాబ్ వైపునకు వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 8 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులు అంతా కూలీ పనుల కోసం ఖుషాబ్​కు వెళ్తున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అధిక వేగం కారణంగానే వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

ముఖ్యమంత్రి సంతాపం
అయితే ఈ మినీ ట్రక్కు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేశారు పంజాబ్ ప్రావిన్స్​ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

మెరుపు వరదలు, 2 వేల ఇళ్లు ధ్వంసం
మరోవైపు, అఫ్గానిస్థాన్‌లో మళ్లీ మెరుపు వరదలు పోటెత్తి 68 మంది మృత్యువాత పడ్డారు. ఘోర్‌ ప్రావిన్సులో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తినట్లు అఫ్గాన్‌ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డజన్ల సంఖ్యలో పౌరులు గల్లంతు కాగా, వందలాది మందికి గాయాలు అయ్యాయి. 2 వేల ఇళ్లకు పైగా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మరో 4 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వేలాది పశువులు మృత్యువాతపడ్డాయి. వందల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. ఘోర్‌ ప్రావిన్సులోని రహదారులు, వంతెనలు దెబ్బతినగా భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత ఆదివారం ఉత్తర అఫ్గాన్‌లో పోటెత్తిన వరదలకు 315 మంది చనిపోయారు. 16 వందల మందికి గాయాలయ్యాయి.

అఫ్గాన్​లో వరద బీభత్సం- 300మందికి పైగా మృతి- వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం - Afghanistan Floods

7 నెలల కాల్పుల విరమణకు హమాస్​ ఓకే- రఫాపై దాడి ప్రకటన వెంటనే అంగీకారం - israel hamas ceasefire

Last Updated : May 18, 2024, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.