ETV Bharat / international

కుమార్తె కోసం ప్రధాని పదవి త్యాగం!- సైన్యానికి తలొగ్గిన నవాజ్ షరీఫ్ - pakistan election RIGGING

Pakistan Elections Army : పాకిస్థాన్‌ రాజకీయాలను సైన్యం శాసిస్తుందనే విషయం మరోసారి బయటపడింది. పాక్ ప్రధానిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టాలని కలలు కన్న నవాజ్ షరీఫ్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే, ఈ సంచలన నిర్ణయం వెనక పాక్‌ ఆర్మీ హస్తం ఉన్నట్లు తేలింది. తన కుమార్తె మరియం రాజకీయ భవిష్యత్తు కోసమే నవాజ్‌ సైన్యానికి తలొగ్గినట్లు తెలుస్తోంది.

Pakistan Elections Army
Pakistan Elections Army
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 10:10 PM IST

Pakistan Elections Army : పాకిస్థాన్‌ రాజకీయాలను అక్కడి సైన్యం శాసిస్తుందనే విషయం మరోసారి బహిర్గతమైంది. ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టి రికార్డ్‌ సృష్టించాలని కలలుగన్న నవాజ్ షరీఫ్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పదవికి తన సోదరుడు, మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్‌ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనక సైన్యం ఒత్తిడి ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో PML(N) పార్టీ మెజార్టీ సాధించలేని నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌కు సైన్యం రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు సమాచారం. ప్రధాని పదవి కావాలా లేక కుమార్తె మరియంకు పంజాబ్ సీఎం పగ్గాలు కావాలో తేల్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

అయితే తన కుమార్తె, రాజకీయ వారసురాలు మరియం కోసం నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవిని త్యాగం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పాకిస్థాన్‌ మిలిటరీకి షెహబాజ్‌ షరీఫ్‌ ఇష్టమైన వ్యక్తి కావటం వల్ల చివరి నిమిషంలో నవాజ్‌ షరీఫ్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం.

పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్
పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు మరోసారి బయటపడింది. ఎన్నికల్లో అక్రమాల వల్లే తాము గెలిచామంటూ రెండు స్థానాలను మూడు పార్టీలు వదులుకోగా తాజాగా ఎన్నికల్లో అక్రమాలు నిజమేనని ఓ బ్యూరోక్రాట్‌ ప్రకటించారు. నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల అక్రమాల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్‌, చీఫ్‌ జస్టిస్‌కు ప్రమేయం ఉందని రావల్పిండి మాజీ ఎన్నికల కమిషనర్‌ లియాఖత్‌ అలీ చత్తా ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు.

ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగినట్లు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలోని తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన నేపథ్యంలో మాజీ బ్యూరోక్రాట్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రావల్పిండి క్రికెట్‌ మైదానంలో మీడియాతో మాట్లాడిన లియాఖత్‌ అలీ పాక్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిపించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల తారుమారులో ఎన్నికల కమిషనర్‌కు, ప్రధాన న్యాయమూర్తికి సంబంధం ఉందని ఆరోపించారు. అయితే మాజీ ఎన్నికల కమిషనర్‌ ఆరోపణలను పాక్‌ ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది. ఆయన ఆరోపణలపై విచారణ చేపడతామని వెల్లడించింది.

'నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు- రష్యా అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ప్రపంచానికి తెలిసింది!'

నవాజ్​ అనూహ్య నిర్ణయం- ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌, సీఎంగా కూతురు ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.