ETV Bharat / international

కిమ్ మరో కవ్వింపు చర్య- యురేనియం ప్లాంట్ ఫొటోస్ రిలీజ్- అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకే! - Kim Nuclear Weapons - KIM NUCLEAR WEAPONS

Kim Nuclear Weapons : అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు సంబంధించిన చిత్రాలను 2010 తర్వాత ఉత్తరకొరియా తొలిసారిగా విడుదల చేసింది. ఆ ప్లాంట్‌ను సందర్శించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అమెరికా సహా మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచేలా ఆ చిత్రాలను ఉత్తరకొరియా విడుదల చేసిందనే చర్చ జరుగుతోంది.

Kim Nuclear Weapons
Kim Nuclear Weapons (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 2:17 PM IST

Kim Nuclear Weapons : నిత్యం క్షిపణులు, శక్తిమంతమైన బాంబుల పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లోకెక్కారు. అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌ను సందర్శించి శత్రు దేశాలపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు కిమ్‌ వెళ్లిన చిత్రాలను ఉత్తరకొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. అక్కడ కిమ్‌జోంగ్ ఉన్‌ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.

అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచండి!
అక్కడే కలియ తిరిగిన కిమ్ ఉత్పత్తి కార్యకలాపాల గురించి వారిని అడిగి తెలుసుకున్నట్టు KCNA వెల్లడించింది. అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారని పేర్కొంది. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌ సాంకేతిక శక్తి పట్ల కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపింది. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు సంబంధించి చాలా ఏళ్లుగా గోప్యత వహించిన ఉత్తరకొరియా తాజాగా ఆ చిత్రాలను బయటపెడ్డటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అణ్వాయుధాల ఉత్పత్తి ప్లాంట్‌ను సందర్శించిన తర్వాత ఓ రాకెట్ లాంచర్ ప్రయోగాన్ని కిమ్ వీక్షించారు. అనంతరం ప్రత్యేక దళాలు శిక్షణ పొందుతున్న ప్రాంతానికి వెళ్లి వారితో గ్రూప్ ఫొటో దిగారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దళాలతో పాటు ఓ గన్ చేతపట్టి కాల్పులు జరిపారు.

Kim Nuclear Weapons
అధికారులతో కిమ్​ (Associated Press)

యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ వద్దకు కిమ్ ఎప్పుడు వెళ్లారనే విషయాన్ని KCNA వెల్లడించలేదు. 2010లో యోంగ్‌బ్యోన్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఉత్తర కొరియా తొలిసారి బయటి ప్రపంచానికి చూపించింది. అప్పట్లో దానిని అమెరికా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇటీవల కాలంలో యోంగ్‌బ్యోన్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో శుద్ధీకరణ సౌకర్యాలను మరింత విస్తరించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలుస్తోంది. అయితే తాజాగా కిమ్ సందర్శించిన కేంద్రం ఈ కాంప్లెక్స్‌లోనిదా కాదా అనేది తెలియాల్సి ఉంది. అణ్వాయుధాల్లో యురేనియం, ప్లుటోనియం రెండింటిని ఉపయోగించుకోవచ్చు. ఈ కాంప్లెక్స్‌లో రెండింటిని ఉత్పత్తి చేసే సదుపాయాలున్నట్టు తెలుస్తోంది.

Kim Nuclear Weapons
అధికారులతో కిమ్​ (Associated Press)

అంతర్జాతీయ శాంతికి తీవ్రమైన ముప్పు!
యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌ చిత్రాలను ఉత్తర కొరియా విడుదల చేయడాన్ని దక్షిణ కొరియా తప్పుపట్టింది. అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచాలని కిమ్ పేర్కొనడాన్ని ఖండించింది. ఐక్యరాజ్యసమితి నిషేధాన్ని ధిక్కరిస్తూ ఉత్తర కొరియా అణ్వాయుధాలను చట్టవిరుద్ధంగా తయారు చేయడం అంతర్జాతీయ శాంతికి తీవ్రమైన ముప్పు అని దక్షిణ కొరియా వ్యాఖ్యానించింది. ఉత్తర కొరియా వద్ద ఇప్పటికే 60 అణ్వాయుధాలు ఉన్నాయని గతంలో దక్షిణ కొరియా ఆరోపించింది. ఏటా 6 నుంచి 18 వరకు అణ్వాయుధాలను ఉత్తరకొరియా తయారు చేస్తోందని అంచనా వేసింది.

Kim Nuclear Weapons
రాకెట్ ప్రయోగాన్ని తిలకిస్తున్న కిమ్​ (Associated Press)

ఉత్తర కొరియా విడుదల చేసిన ఫొటోలలో సుమారు వెయ్యి సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయి. ఒక ఏడాది మొత్తం పనిచేస్తే వాటి నుంచి దాదాపు 25 కిలోల ఎన్‌రిచ్డ్‌ యురేనియం ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. వీటితో ఓ బాంబును తయారు చేయొచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఉత్తర కొరియా విడుదల చేసిన చిత్రాల వల్ల ఆ దేశం ఉత్పత్తి చేసిన అణు పదార్థాల పరిమాణాన్ని అంచనా వేయడానికి బయటి దేశాలకు వీలుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనేదే కిమ్‌ లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. దీని వల్ల తమ దేశాన్ని అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని కిమ్‌ ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఆర్థిక, సైనికపరమైన ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలనేది ఆయన లక్ష్యమని వివరించారు.

వరదల్లో మునిగిన నార్త్ కొరియా - బాధితుల్ని పరామర్శించిన కిమ్

250 న్యూక్లియర్​ క్షిపణి లాంఛర్లతో - ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన - NORTH KOREA MISSILE LAUNCHERS SHOW

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.