ETV Bharat / international

బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా - నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్! - Muhammad Yunus - MUHAMMAD YUNUS

Muhammad Yunus To Be Chief Adviser Of Interim Govt In Bangladesh : బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్​ యూనస్‌ను నియమించాలని విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ ప్రతిపాదించింది. ఆ సంస్థ కోఆర్డినేటర్ నహీద్ ఇస్లామ్ చేసిన ప్రకటన వివరాలివీ.

Muhammad Yunus
Muhammad Yunus (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 9:06 AM IST

Updated : Aug 6, 2024, 9:26 AM IST

Muhammad Yunus To Be Chief Adviser Of Interim Govt In Bangladesh : బంగ్లాదేశ్‌లో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి సంబంధించి విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ కీలక ప్రతిపాదన చేసింది. కొత్త ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్​ యూనస్‌ను నియమించాలని డిమాండ్ చేసింది.

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం నడిపిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం మంగళవారం తెల్లవారు జామున సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో "దేశాన్ని రక్షించాలనే విద్యార్థి సంఘం పిలుపు మేరకు ప్రొఫెసర్​ ముహమ్మద్ యూనస్​, మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించారు. మధ్యంతర ప్రభుత్వ రూపురేఖలు ఎలా ఉండాలనే దానిపై 24 గంటల్లోగా ప్రతిపాదనలు ఇస్తామని చెప్పాం. అందుకు అనుగుణంగానే దేశ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆ ప్రతిపాదనలను వెల్లడిస్తున్నాం' అని ఆ వీడియోలో నహీద్ పేర్కొన్నారు.

ఆయనకు ఆమోదయోగ్యత ఉంది!
‘‘అంతర్జాతీయంగా ఖ్యాతి కలిగిన ముహమ్మద్​ యూనస్‌‌ను ప్రధాన సలహాదారుడిగా నియమించి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యత ఉంది. అటువంటి వ్యక్తికి ఆ కీలక స్థానం దక్కాల్సిందే’’ అని నహీద్ తెలిపారు. ముహమ్మద్​ యూనస్‌ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని నహీద్​ కోరారు. ఈ వీడియో సందేశంలో నహీద్ వెంట మరో ఇద్దరు ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ కోఆర్డినేటర్లు కూడా కనిపించారు.

బంగ్లాదేశ్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు
అంతకుముందు సోమవారం అర్ధరాత్రి తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కీలక ప్రకటన విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి అధికారిక టీవీ ఛానల్‌ వేదికగా ప్రసంగిస్తూ ఈ విషయాన్ని షహబుద్దీన్ తెలిపారు. దీనికంటే ముందు షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి, విపక్ష నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి ఖాలెదా జియాను హౌస్ అరెస్టు నుంచి విడుదల చేస్తూ బంగ్లాదేశ్ అధ్యక్షుడు సంచలన ఆదేశాలు జారీ చేశారు.

ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి - రంగంలోకి అమెరికా, జీ-7 దేశాలు! - Iran And Hezbollah Attack On Israel

250 న్యూక్లియర్​ క్షిపణి లాంఛర్లతో - ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన - NORTH KOREA MISSILE LAUNCHERS SHOW

Last Updated : Aug 6, 2024, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.