ETV Bharat / international

ఎన్నికల బరి నుంచి నిక్కీ హేలీ ఔట్- అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్​ - us presidential election 2024

Nikki Haley Drop Out US Presidential Race : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి నిక్కీ హేలీ తప్పుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన అభ్యర్థిత్వ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రిపబ్లికన్​ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్​ పేరు దాదాపు ఖరారు కానుంది.

Nikki Haley Drop Out US Presidential Race

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 5:23 PM IST

Updated : Mar 6, 2024, 9:56 PM IST

Nikki Haley Drop Out US Presidential Race : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ అధికారికంగా ప్రకటించారు. బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన అభ్యర్థిత్వ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. "నా క్యాంపెయిన్‌ను నిలిపివేయాల్సిన సమయం వచ్చింది. అమెరికన్లు తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నానని చెప్పేదాన్ని. నేను ఆ పని చేశా. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఇకపై అభ్యర్థిని కానప్పటికీ, నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించడం ఆపను" అని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు అభినందనలు తెలిపిన హేలీ, అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. ఫలితంగా రిపబ్లికన్​ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో డొనాల్డ్ ట్రంప్​ ఒక్కరే మిగిలారు.

సూపర్‌ట్యూస్‌డే పేరిట మంగళవారం అమెరికాలోని 15 రాష్ట్రాల్లో, ఒక టెరిటరీలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన ట్రంప్‌, నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బైడెన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ ఒక్క వెర్మొంట్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లో గెలుపొందారు. వెర్మొంట్‌లో ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ విజయం సాధించారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.

మరోవైపు డెమోక్రాటిక్‌ పార్టీలో జో బైడెన్ మంగళవారం జరిగిన దాదాపు అన్ని ప్రైమరీల్లో గెలుపొందినట్లు CNN వెల్లడించింది. ఒక్క సమోవా టెరిటరీలో మాత్రం జేసన్‌పామర్‌ చేతిలో ఆయన ఓడిపోయారు. లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్‌ పొందడానికి ట్రంప్‌ ఈ నెల 12 వరకు, బైడెన్‌ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది. రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. సూపర్‌ ట్యూస్‌డే వరకు హేలీ ఖాతాలో 86 మంది, ట్రంప్‌ ఖాతాలో 956 మంది ఉన్నారు. అటు డెమొక్రటిక్‌ పార్టీలో 1,968 ప్రతినిధుల మద్దతు అవసరం కాగా, 994 మంది బైడెన్‌కు అనుకూలంగా ఉన్నారు.

తొలి మహిళగా రికార్డ్​
తొలుత 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని అనుకున్న హేలీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినా సహా చాలా ప్రైమరీల్లో నిక్కీ ఓడినప్పటికీ, ఆమె రేసు నుంచి వైదొలగడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ట్రంప్‌నకు తానే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారంలో పదేపదే చెబుతూ తన అభిమానులను ఉత్తేజపరిచారు. తాజాగా ఆదివారం జరిగిన వాషింగ్టన్‌ డీసీ ప్రైమరీలో డొనాల్డ్‌ ట్రంప్‌పై నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో రిపబ్లికన్‌ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు హేలీ. దీంతో పాటు అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల తరఫున ప్రైమరీ నెగ్గిన తొలి భారత సంతతి అమెరికన్‌గా కూడా నిలిచారు.

15 రాష్ట్రాల ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ హవా - అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ 'ఢీ'!

ట్రంప్​ దూకుడుకు బ్రేక్​- నిక్కీ హేలీకి తొలి ప్రైమరీ విజయం

Last Updated : Mar 6, 2024, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.