ETV Bharat / international

అమెరికాలో 14వేల మందితో మోదీ ఈవెంట్- 31ఏళ్ల క్రితం రెండే రెండు డ్రెస్సులతో యూఎస్ టూర్! - MODI AMERICA TOUR - MODI AMERICA TOUR

Modi America Tour : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన న్యూయార్క్​లో సెప్టెంబర్‌ 22న 'మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ కు 14వేల మంది హాజరవ్వనుండగా, పెద్దసంఖ్యలో సెలబ్రిటీలు రానున్నారని తెలుస్తోంది. మరోవైపు, ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన యూఎస్ పర్యటన సమయంలో రెండు జతల దుస్తులనే తన వెంట తీసుకెళ్లారని ప్రవాస భారతీయులు ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

Modi America Tour 1993
Modi America Tour (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 6:05 PM IST

Updated : Sep 21, 2024, 6:36 PM IST

Modi America Tour : అమెరికా న్యూయార్క్​లో ఆదివారం(సెప్టెంబరు 22న) జరగనున్న 'మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌' ఈవెంట్​కు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి నసావు వెటరన్స్‌ మెమోరియల్‌ కొలీజియం వేదిక కానున్నట్లు పేర్కొంది. కాగా, ఈ కార్యక్రమానికి దాదాపు 14వేల మంది హాజరవ్వనుండగా, పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు రానున్నారని తెలుస్తోంది. 500 మంది కళాకారులు, 350 మంది వాలంటీర్లు, 85 మీడియా వర్గాలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్​లో ప్రవాస భారతీయులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

కళాకారుల ప్రదర్శనలు
'మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌' కార్యక్రమంలో 'ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్' నిర్వహించనున్నామని ఈవెంట్‌ కీలక నిర్వాహకుడు సుహాగ్ శుక్లా వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం రెండు వేదికలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాన వేదికపై గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలు ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. మరో వేదికపై 117 మంది కళాకారుల విశిష్ట ప్రదర్శనలతో కొలీజియంలోకి ప్రవేశించిన వారిని అలరిస్తారని అన్నారు. 30కి పైగా శాస్త్రీయ, జానపద, ఆధునిక ఫ్యూజన్ ప్రదర్శనలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

గతంలో రెండుసార్లు
అయితే, దేశానికి తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014లో న్యూయార్క్​లో జరిగిన ఓ భారీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత 2019లో టెక్సాస్‌ హ్యూస్టన్​లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సైతం ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

ప్రధాని మోదీ యూఎస్ తొలి పర్యటన గుర్తులు
మరోవైపు, ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఇప్పటికే అధికారికంగా ఎన్నోసార్లు అమెరికా వెళ్లిన ప్రధాని, 1993లో తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ తొలిసారి అమెరికా పర్యటన నాటి సంగతులను మీడియాతో పంచుకున్నారు ప్రవాస భారతీయులు. 1993లో ప్రధాని మోదీ తొలిసారి యూఎస్ పర్యటనకు వచ్చారని, ఈ సందర్భంగా ఆయనను కలిసే అవకాశం తనకు వచ్చిందని అట్లాంటాకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ వాసుదేవ్ పటేల్ తెలిపారు. ప్రధాని మోదీ యూఎస్ లోని సాంకేతికతపైనా, తాను పర్యటించే ప్రాంతాల చరిత్ర తెలుసుకోవాలనే విషయంపై చాలా ఆసక్తి కనబర్చారని గుర్తుచేసుకున్నారు.

"మేం ఏ ప్రాంతానికీ వెళ్లినా, ఎప్పుడూ ఏదోఒకటి చదువుతూనే ఉండేవారు మోదీ. ఏదైనా చారిత్రక సమాచారాన్ని చూస్తే, వెంటనే దానిని చదివేసేవారు. ఆయనకు బస కల్పించినవారికి భారంగా ఉండకూడదనని భావించేవారు. ఇంటి, వంట పనిలో ఏదైనా సాయం కావాలా? అని తరచూ అడిగేవారు. ఫొటోగ్రఫీ అంటే ప్రధానికి చాలా ఇష్టం. తన పర్యటనలకు సంబంధించి ప్రతీ విషయాన్ని కెమెరాలో బంధించాలనుకునేవారు. తన అనుభవాలకు సంబంధించిన చిత్రాలతో గాంధీనగర్‌లో ఒక పెద్ద ఫొటో లైబ్రరీ ఉంది. అలాగే ప్రతీ ఒక్కరితో మోదీకి మంచి సంబంధాలు ఉండేవి. చిరునవ్వుతో మాట్లాడుతారు. సాయం చేయడంలో ముందుండేవారు "

- డాక్టర్ వాసుదేవ్ పటేల్, ప్రవాస భారతీయుడు

రెండు జతల దుస్తులతో అమెరికా పర్యటన
అయితే ప్రధాని మోదీ 1993లో అమెరికాకు వెళ్లినప్పుడు, ఆయన ప్రవాస భారతీయులైన డాక్టర్ భరత్‌, పన్నా బరై దంపతుల ఇంట్లో బస ఉన్నారు. ఈ సందర్భంలో ఆనాటి గుర్తులను మీడియాకు చెప్పారు డాక్టర్ భరత్ దంపతులు. "1993లో అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మోదీ తన సూట్‌ కేసులో రెండు జతల దుస్తులే తెచ్చుకున్నారు. దాంతో ఆయన రోజు దుస్తులు ఉతుకుకోవాల్సి వచ్చేది. మామూలుగా అమెరికాలో వారానికి ఒకసారి ఈ పనులు చేస్తుంటారు. అది మోదీ నిరాడంబరతకు నిదర్శనం. భారత్‌ పై ప్రేమ, అభిరుచి మోదీ మాటల్లో స్పష్టంగా కనిపించేవి. ఒక్కోసారి కళ్లు చెమర్చేవి" అని పన్నా వివరించారు.

అమెరికా పర్యటన ఎందుకంటే?
1893లో స్వామి వివేకానంద చికాగోలో సర్వమత సమ్మేళనంలో చరిత్రాత్మక ప్రసంగం చేసి 100 ఏళ్లు అయిన సందర్భంగా, 1993లో విశ్వహిందూ పరిషత్‌ అమెరికాలో ఓ కార్యక్రమం నిర్వహించింది. అందుకే ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. అప్పుడు ఆయన డెల్టా ఎయిర్‌ లైన్స్ పాస్ ఉపయోగించారు మోదీ. బీజేపీ నేతగా అక్కడ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో తన వద్ద ఉన్న కొద్ది మొత్తాన్ని ఎంతో పొదుపుగా వాడుకున్నారు. న్యూయార్క్‌ నుంచి కాలిఫోర్నియా మధ్య దూరం 4,500 కి.మీ. దాంతో ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకోసం డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన నెలవారీ పాస్‌ను తీసుకున్నారు.

కాగా డెల్టా పాస్ వాడాలంటే లగేజీపై పరిమితి విధించేవారు. నచ్చిన సీటు ఎంచుకోవడానికి ఉండదు. రెండు జతల దుస్తులతో వెళ్లిన మోదీ, ఈ పాస్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రవాస భారతీయులను కలుసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న మోదీ, ఆ నెల రోజులు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక హోటల్ ఖర్చులు తగ్గించుకునేందుకు లేట్‌ నైట్‌ జర్నీలు చేసేవారని తెలుస్తోంది. విమానంలోనే నిద్రపోయి, పొద్దున్నే ప్రవాసుల్ని కలుసుకునేవారని ఓ జాతీయ మీడియా కథనంలో వెల్లడించింది.

ప్రధాని మోదీ 3 రోజుల అమెరికా పర్యటన
సెప్టెంబరు 21-23వ తేదీ వరకు మోదీ అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో విల్మింగ్టన్‌ వేదికగా నిర్వహించనున్న నాలుగో 'క్వాడ్‌ సదస్సు'లో పాల్గొనున్నారు. సెప్టెంబరు 22న 'మోదీ అండ్ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొంటారు. 23న న్యూయార్క్​లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రసంగిస్తారు. పలు అమెరికన్ అగ్రశ్రేణి సంస్థల సీఈఓలతో మోదీ సమావేశమవుతారు. "ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం క్వాడ్ సదస్సును వెళ్తున్నాను. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అవుతున్నా. ఈ సమావేశం దేశ, ప్రపంచ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది." అని ప్రధాని మోదీ ఎక్స్​లో పోస్టు చేశారు.

'మోదీ అద్భుతమైన వ్యక్తి- ఆయనతో త్వరలో భేటీ అవుతా'- అనూహ్యంగా రివీల్​ చేసిన ట్రంప్‌! - Modi America Tour 2024

'భారత్​లో అనేక సింగపూర్​లను సృష్టిస్తాం- త్వరలో ఇండియాకు రూ.5లక్షల కోట్ల పెట్టుబడులు!' - PM Modi Singapore Tour

Last Updated : Sep 21, 2024, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.