ETV Bharat / international

ఇక కండోమ్​లు, వేసెక్టమీతో పని లేదు! మగవారు ఈ జెల్​ రాసుకుంటే ప్రెగ్నెన్సీ కంట్రోల్! - Male Birth Control Gel

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 2:35 PM IST

Male Birth Control Gel : గర్భ నివారణ కోసం పురుషులకు సరికొత్త పద్ధతి అందుబాటులోకి రానుంది. అందులో భాగంగా జిగురు ద్రవ(జెల్​)ను భుజాలపై రాసుకుంటే వారాల్లో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు మీకోసం.

Male Birth Control Gel
Male Birth Control Gel (GettyImages)

Male Birth Control Gel : గర్భం నివారణ కోసం ప్రస్తుతం పురుషులకు కండోమ్‌లు, వేసెక్టమీ శస్త్రచికిత్స వంటివి అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికంటే ప్రభావంతమైన పద్ధతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జిగురు ద్రవం (జెల్​) రూపంలో ఉండే ఓ క్రీమ్​ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీన్ని భుజాలపై రాసుకోవడం వల్ల వారాల వ్యవధిలో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందట. గర్భ నివారణకు సంబంధించిన పురుషుల కోసం ఇది మరో మంచి ఆప్షన్​ అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు NES/T అనే జెల్​పై చేసిన పరిశోధన వివరాలను ఆదివారం వెల్లడించారు.

NES/T అంటే నెస్టోరోన్, టెస్టొస్టెరాన్ అనే రెండు ప్రధాన పదార్థాల కలయిక. గర్భం, ఇతర పునరుత్పత్తి విధులను నిర్వర్తించే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్​ సింథటిక్​ వెర్షనే ఈ నెస్టోరోన్​. మహిళల్లో గర్భ కారక హార్మోన్ల నియంత్రణకు ఈ నెస్టోరోన్​ వంటి ఔషధాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఔషధాన్ని పురుషులకు ఇచ్చినప్పుడు, వృషణాల్లో ఉన్న టెస్టోస్టిరాన్​ వంటి సంతానోత్పత్తి హార్మోన్ల లెవెల్స్​ను తగ్గిస్తుంది. ఫలితంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఈ ఔషధం రక్తంలో ఉన్న టెస్టోస్టిరాన్​ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇది పురుషుల్లో సెక్స్​ లైఫ్​పై ప్రభావం చూపిస్తుంది. ఈ నెస్టోరోన్​ ఔషధం పురుషులకు ఇవ్వడం ద్వారా మరికొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​ కూడా ఉన్నాయి.

అయితే పురుషుల రక్తంలో హార్మోన్​ లెవెల్స్​ను నిలకడగా ఉంచడానికి, జెల్​ ద్వారా టెస్టోస్టెరాన్​ను ప్రవేశపెట్టడం ద్వారా తాత్కాలికంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. సైడ్​ ఎఫెక్ట్స్​ కూడా తక్కువ అవుతాయి. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలతో కలిసి అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (NICHD) ఈ జెల్​ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ NES/T జెల్​పై ఫేజ్​ 2బీ ట్రయల్స్​ జరుగుతున్నాయి. అయితే ట్రయల్​ ఇంకా పూర్తి కాకముందే, అందుబాటులో ఉన్న డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ జెల్​ ఆశాజనక ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

NICHD గర్భనిరోధక అభివృద్ధి కార్యక్రమం చీఫ్ డయానా బ్లైత్, ఆమె బృందం ఈ జెల్​ ఎంత సమయంలో ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని పరిశీలించారు. ఈ జెల్​ చాలా మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను 12 నుంచి 15 వారాల్లో సమర్థంగా తగ్గించే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే చాలా మందిలో చాలా తక్కువ సమయంలో వీర్యకణాల సంఖ్య తగ్గిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రయల్స్​లో పాల్గొన్న 222 మందికి ట్రీట్​మెంట్​ ప్రారంభించిన 15 వారాల్లోపు 86శాతం స్పెర్మ్​ కౌంట్​ తగ్గిందని తెలిపారు. ఐదు వారాల్లో 20శాతం, 8వారాల్లో 52శాతం, 9వారాల్లో 62శాతం స్పెర్మ్​ కౌంట్​ తగ్గిందని వెల్లడించారు.

అయితే ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడటానికి ఇంకా సమయం పడుతుంది. కానీ బ్లైత్​, ఆమె బృందం మాత్రం ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ఫేజ్​ 3 ట్రయల్స్​ ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియ గురించి చర్చించడానికి బ్లైత్​ బృందం వచ్చే ఏడాది ఎఫ్​డీఏతో సమావేశం కానుంది. మరోవైపు, ఈ జెల్​ను మార్కెట్​లోకి తీసుకురావడానికి వాణిజ్య భాగస్వామి కోసం బ్లైత్​ బృందం వెతుకుతోంది. కాబట్టి పురుషులు సులభంగా, సమర్థంగా సంతానోత్పత్తి నియంత్రణ పొందేందుకు మరి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.