ETV Bharat / international

బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్- పార్టీలో 60శాతం మంది ఆమె వైపే మొగ్గు! - US Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 4:14 PM IST

US Elections 2024 Kamala Harris : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నేతలే జో బైడెన్ తప్పుకుని వేరే వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అసోసియేటెడ్​ ప్రెస్​-నేషనల్​ ఒపీనియన్​ రీసెర్చ్​ సెంటర్ జరిపిన ఓ సర్వేలో ​ప్రతి 10 మంది డెమోక్రాట్లలో ఆరుగురు కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. దీంతో డెమోక్రాట్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో కమల ఉండనున్నారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి.

US Elections 2024 Kamala Harris
US Elections 2024 Kamala Harris (Getty Images)

US Elections 2024 Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల మధ్య ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాటుకు గురికావడం, ఆయన ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును ప్రసంగాల్లో సంబోధిస్తుండటం, చిత్ర విచిత్ర ప్రదర్శన నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక కొందరు డెమోక్రాట్లు అయితే పోటీ నుంచి బైడెన్ తప్పుకుని వేరేవారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసోసియేటెడ్​ ప్రెస్​-నేషనల్​ ఒపీనియన్​ రీసెర్చ్​ సెంటర్ ​(ఏపీ-ఎన్ఓఆర్​సీ) తాజాగా నిర్వహించిన సర్వేలో జో బైడెన్​కు బదులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ను అధ్యక్ష బరిలోకి నిలపడం మంచిదని డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తేలింది. డెమోక్రాట్లలో ఎక్కువ మంది కమలవైపే మొగ్గు చూపారు.

10 మందిలో ఆరుగురు ఆమెకే జై!
ప్రతి 10 మంది డెమోక్రాట్లలో ఆరుగురు కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఇద్దరు ఆమెకు మద్దతు తెలపకపోగా, మరో ఇద్దరు తమకు తెలియదని చెప్పారని అసోసియేటెడ్​ ప్రెస్​-నేషనల్​ ఒపీనియన్​ రీసెర్చ్​ సెంటర్​ సర్వే తెలిపింది. ట్రంప్​తో లైవ్ డిబేట్​లో తేలిపోవడం, పలుచోట్ల గందరగోళానికి గురవ్వడం వంటి కారణాలతో జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు ప్రత్యామ్నాయంగా కమలా హ్యారిస్ వైపు డెమోక్రాట్లు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్​నకు పోటీగా కమలను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.

అలాగే కమలా హ్యారిస్ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆమె పనితీరుపై కూడా సర్వేలో అమెరికన్లు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. 10 మంది అమెరికన్లలో ముగ్గురు మాత్రమే కమలా హ్యారిస్ అధ్యక్షురాలిగా రాణించగలరని చెప్పారు. రాణించలేరని ఐదుగురు, ఏం చెప్పలేమని మరో ఇద్దరు వెల్లడించారు. కమలపై కూడా జో బైడెన్​పై ఉన్నంత సానుకూలతే అమెరికన్లలో ఉన్నట్లు తేలింది. ప్రతి 10 మందిలో నలుగురు కమలపై సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉండగా, మరో ఐదుగురు ఆమెకు అనుకూలంగా లేరు. అదే సర్వేలో జో బైడెన్​కు ఆరుగురు ప్రతికూల దృక్పథంతో ఉన్నట్లు తేలింది. దాదాపు మూడొంతుల మంది డెమోక్రాట్​లు కమలా హ్యారిస్​పై సానుకూల దృక్పథంతో ఉన్నారు.

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సాధించిన విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని డెమోక్రాట్ ఓక్లీ గ్రాహమ్ తెలిపారు. కమల్ హ్యారిస్​కు మద్దతు ఇవ్వడానికి మరింత ఉత్సాహంగా ఉంటానని పేర్కొన్నారు. అమెరికాకు కమలా హ్యారిస్ మహిళ అధ్యక్షురాలు అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మిస్సౌరీలోని పార్టీ కార్యాలయంలో ఓక్లీ గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే ట్రంప్ రన్నింగ్ మేట్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిపై జేడీ వాన్స్​పై జరిపిన సర్వేలో ఆయన తెలియదని 10 మందిలో ఆరుగురు తెలిపారు. మరో ఇద్దరు అనుకూలంగా, మరో ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఈ సర్వే జేడీ వాన్స్​ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించకముందు అసోసియేటెడ్​ ప్రెస్​-నేషనల్​ ఒపీనియన్​ రీసెర్చ్​ సెంటర్ సర్వే జరిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.