ETV Bharat / international

హోలీ వేళ ఆకాశంలో అద్భుతం! మార్చి 25న చంద్రగ్రహణం విశేషాలివే! - Lunar Eclipse on Holi - LUNAR ECLIPSE ON HOLI

Lunar Eclipse On Holi : మార్చి 25న ఓ వైపు రంగుల పండుగ హోలీ కేరింతలు మార్మోగుతుండగా, మరోవైపు ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సోమవారం ఉదయం 10.23 గంటలకు 'పెనంబ్రల్ చంద్రగ్రహణం' ప్రారంభం కాబోతోంది. సాధారణ చంద్ర గ్రహణానికి 'పెనంబ్రల్ చంద్రగ్రహణానికి' తేడా ఏమిటి ? ఎందుకంత స్పెషల్? మన దేశంలో కనిపిస్తుందా ? అనే వివరాలు తెలుసుకుందాం.

LUNAR ECLIPSE ON HOLI
LUNAR ECLIPSE ON HOLI
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 6:38 PM IST

Lunar Eclipse On Holi : మార్చి 25న హోలీ పండుగతో పాటు ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అదే 'పెనంబ్రల్ చంద్రగ్రహణం'. ఈనేపథ్యంలో 'పెనంబ్రల్ చంద్రగ్రహణం' అంటే ఏమిటి ? అది ఏ సమయంలో సంభవిస్తుంది? మన దేశంలో కనిపిస్తుందా ? అనే అంశాలపై ఆసక్తికర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు గ్రహణాలు సంభవిస్తుంటాయి. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడు సంభవిస్తుంది. ఫలితంగా పౌర్ణమిరోజు గ్రహణ సమయంలో పూర్ణ చంద్రుడు కనిపించడు. అయితే అన్ని పౌర్ణమిలలోనూ చంద్రగ్రహణం ఏర్పడదు. చంద్ర గ్రహణానికి ముందు ఎరుపు రంగులో చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం దానిపై ప్రతిబింబించడం వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.

పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటే ?
చంద్ర గ్రహణాలు మూడు రకాలు. అవి సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ చంద్ర గ్రహణాలు (Penumbral Eclipse). మార్చి 25న ఏర్పడబోయేది పెనంబ్రల్ చంద్రగ్రహణం. పాక్షిక, సంపూర్ణ గ్రహణాల కంటే పెనంబ్రల్ చంద్ర గ్రహణాన్ని గుర్తించడానికి నిశిత పరిశీలన అవసరం. పెనంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లుగా కనిపిస్తాడు.

మన దేశంలో చూడొచ్చా?
Lunar Eclipse 2024 Date And Time : సోమవారం ఉదయం 10.23 గంటల నుంచి మధ్యాహ్నం 3.01 గంటల వరకు కొనసాగే పెనంబ్రల్ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. పలు ఐరోపా, ఉత్తర అమెరికా, ఉత్తర/ తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, దక్షిణ నార్వే, స్విట్జర్లాండ్ ప్రజలు కూడా ఈ ఘట్టాన్ని తిలకించవచ్చు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 8న సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రిపూట సంభవించే సూర్యగ్రహణాన్ని మనం చూడలేం.

ఆ కలర్స్​తో డేంజర్​- హోలీ ఆడే ముందు, తర్వాత ఇలా చేయడం మస్ట్! - Pre And Post Holi Care Tips

పర్యావరణ హితంగా హోలీ- ఇంట్లోనే రంగులను తయారు చేయండిలా! - Holi Colors Preparation In Home

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.