Kim Drives War Tank : ఉత్తర కొరియా ఈ మధ్య కాలంలో నిరంతర యుద్ధ సన్నద్ధత, ఆయుధాల ప్రయోగ పరీక్షలతో వార్తల్లో నిలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, పొరుగుదేశం దక్షిణ కొరియాకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. స్వయంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ సొంతంగా ఓ యుద్ధ ట్యాంకును నడిపినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. వాటికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు స్వయంగా కిమ్ రంగంలోకి దిగినట్లు పేర్కొంది. ఇటీవల అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ట్యాంకుల పనితీరును సైనికులతో కలిసి కిమ్ పర్యవేక్షించినట్లు తెలిపింది.
భారీ యుద్ధ ట్యాంకులతో చేసిన విన్యాసాల్లో ఉత్తర కొరియా సైన్యం అత్యంత కఠిన పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు KCNA వెల్లడించింది. డమ్మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు చెప్పింది. 2022 ఆరంభం నుంచి ఉత్తర కొరియా నిరంతరం క్షిపణులు, అత్యాధునిక తుపాకులు సహా వివిధ రకాల ఆయుధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. మరోవైపు, అగ్రరాజ్యం అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమపై ఆక్రమణకు సన్నాహకంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిస్పందనగా ట్యాంకులతో తమ పాటవాన్ని ప్రదర్శిస్తోంది.
కన్నీరుపెట్టిన కిమ్
Kim Jong Un Cries During Speech : కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏడ్చారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూనే దేశ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు కిమ్. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ విలపించారు. ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్, ఆ తల్లులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కిమ్ కటీఫ్- దక్షిణ కొరియాతో మాటలు బంద్- త్వరలో రాజ్యాంగ సవరణ!
పుతిన్ దోస్త్ మేరా దోస్త్- ప్రపంచాన్ని ఎదురించి మరీ కిమ్‌కు స్పెషల్ గిఫ్ట్