Kenya Dam Collapse : కెన్యాలో డ్యామ్ కూలిపోయిన ఘటనలో దాదాపు 40మంది మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగి పశ్చిమ కెన్యా, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలోని మై మహియు ప్రదేశంలో ఉన్న ఓల్డ్ కిజాబే డ్యామ్ సోమవారం ఉదయం కూలి పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా ఆకస్మిక వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద కారణంగా ప్రధాన రహదారి ధ్వంసమైందని తెలిపారు.
మరోవైపు కెన్యాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి ఇప్పటివరకు దాదాపు 100మంది మరణించారు. పాఠశాలలకు సెలవులను పొడిగించారు.
గత నెల మధ్య నుంచి కెన్యాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి శనివారం కెన్యాలోని ప్రధాన విమానాశ్రయం వరదతో నిండిపోయింది. రన్‌వే, టెర్మినల్స్, కార్గో విభాగం నీటిమునిగాయి. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు అధికారులు. ఇక ఈ వరదల కారణంగా కెన్యాలో 2 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు స్థానిక పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకునేందుకు భూమిని కేటాయించాలని నేషనల్ యూత్ సర్వీస్‌ను ఆదేశించారు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో.
మరోవైపు కెన్యాలోనే కాకుండా తూర్పు ఆఫ్రికా ప్రాంతంలోని దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరదల కారణంగా టాంజానియాలో 155మంది మరణించారు. దాని పొరుగున ఉన్న బురుండిలో 2 లక్షల మందికి పైగా ప్రజలు వరదల వల్ల ప్రభావితులయ్యారు.
48మంది మృతి
గతేడాది ఇదే పశ్చిమ కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 48 మందిని బలి తీసుకుంది. రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై ఓ లారీ దూసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 48 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
రంగంలోకి బైడెన్- గాజాకు మరింత సాయం- అమెరికా వర్సిటీలో పాలస్తీనా జెండా కలకలం! - Israel Hamas News
ఆ సమయంలో బాగా కుంగిపోయా- సూసైడ్ చేసుకోవాలనుకున్నా: బైడెన్ - Joe Biden Latest Speech