ETV Bharat / international

ఇజ్రాయెల్‌ నెక్స్ట్​ టార్గెట్స్ అవేనా? ఇరాన్ టాప్ లీడర్​పైనే గురి పెట్టిందా? - Israel Iran Conflict - ISRAEL IRAN CONFLICT

Israel Iran Conflict : ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల దాడితో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ దాడికి ఇరాన్‌ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని స్వయంగా చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది. ఇజ్రాయెల్‌ తదుపరి లక్ష్యం ఏంటనే అంశం చర్చనీయాంశమైంది. ఇరాన్‌ అణుస్థావరాలు, విద్యుత్‌ కేంద్రాలను ధ్వంసం చేయాలనే వాదన పశ్చిమ దేశాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీని లక్ష్యంగా చేసుకోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Israel Iran Conflict
Israel Iran Conflict (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 3:33 PM IST

Israel Iran Conflict : హమాస్‌, హెజ్‌బొల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఆయా ప్రాంతాలపై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిప‌ణుల వ‌ర్షం కురిపించడం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ చ‌ర్యతో ప‌శ్చిమాసియా మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మారగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. జులైలో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న హ‌మాస్ నేత ఇస్మాయెల్ హ‌నియే బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చ‌ర్య వెనుక ఇజ్రాయెల్ ఉండ‌గా ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది.

త‌మ అతిథిగా ఉన్న హ‌నియే హత్యకు ప్రతీకారం ఉంటుంద‌ని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. తాజాగా ఇరాన్‌కు అత్యంత స‌న్నిహితుడైన లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా అగ్రనేత న‌స్రల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమార్చింది. ఫలితంగా ఇరాన్ ఆగ్రహం తార‌స్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం యెమెన్‌లోని హూతీల స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్‌ భీక‌ర‌ దాడిచేసింది. హ‌మాస్‌, హెజ్‌బొల్లా, హూతీలు ఇరాన్‌కు అనుకూల‌వ‌ర్గాలు కాగా వారికి ఇరాన్ శిక్షణ ఇస్తోంది. వీటిపై ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్ ప్రతిదాడులకు దిగింది.

అమెరికా సాయంతో అడ్డుకున్న ఇజ్రాయెల్​
2024 ఏప్రిల్‌లో సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్‌ సైనికాధికారులు చ‌నిపోగా అందుకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిప‌ణుల‌తో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. అయితే వీటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్‌ అడ్డుకుంది. తాజాగా త‌మ అనుకూల ద‌ళాల నేత‌ల‌ను చంప‌డంపై గుర్రుగా ఉన్న ఇరాన్ మ‌రోసారి దాడి చేసింది. గ‌తంలో ఇరాన్ దాడుల‌కు ప్రతిస్పంద‌న‌గా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణుకేంద్రాల స‌మీప ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. తాజాగా ఇరాన్‌ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందనే ఆందోళ‌న‌ వ్యక్తమవుతోంది.

అణుస్థావరాల ధ్వంసమే ప్రధాన లక్ష్యం!
తాజా దాడులను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ముందున్న ఆప్షన్లలో అణుస్థావరాల ధ్వంసం ప్రధానంగా కనిపిస్తోంది. టెహ్రాన్‌కు పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్రబిందువు. దీంతో ఇరాన్‌ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇజ్రాయెల్‌కు అవకాశం లభించినట్లైంది. ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్‌ ఇదే విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ధ్వంసం చేయడమే సరైన పని
పశ్చిమాసియా ముఖచిత్రం మార్చేందుకు ఇదే అద్భుతమైన అవకాశమన్న ఆయన వ్యూహాల్లో దిట్ట అయిన ఇరాన్‌ భారీ తప్పు చేసిందని, ఇజ్రాయెల్‌ ఇప్పుడు కచ్చితంగా ఆ దేశ అణు స్థావరాలు, ప్రధాన విద్యుత్తు కేంద్రాల్ని ధ్వంసం చేయాలని పేర్కొన్నారు. అమెరికా రక్షణశాఖ మాజీ మంత్రి విలియమ్‌ కోహెన్‌ కూడా ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయొచ్చని విశ్లేషించారు. డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి జారెడ్‌ మాస్కోవిట్జ్‌ కూడా ఇరాన్‌ అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే సరైన పని అని అభిప్రాయపడినట్లు తెలిసింది.

ఇరాన్‌ టాప్‌ లీడర్‌ ఖమేనీపై గురి
మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటనను చూస్తే ఐడీఎఫ్‌ దళాల గురి ఇరాన్‌ టాప్‌ లీడర్‌ ఖమేనీపై ఉన్నట్లు తెలుస్తోంది. నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ రెండురోజుల క్రితం ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. మరుసటిరోజే ఇరాన్‌ క్షిపణులతో దాడి చేయగా పాలకులు తమ ఆత్మరక్షణ శక్తిని, శత్రువులపై ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారంటూ నెతన్యాహు తీవ్రస్థాయిలో స్పందించారు. హమాస్‌, హెజ్‌బొల్లా అగ్రనేతలు తమను తక్కువగా అంచనా వేసి దెబ్బతిన్నారని పేర్కొన్న ఆయన, ఇరాన్‌ కూడా అలానే చేస్తోందని ధ్వజమెత్తారు. ఇరాన్‌ నాయకత్వానికి అర్థమయ్యే రీతిలో జవాబు చెబుతామని వ్యాఖ్యానించారు.

రంగంలోకి అమెరికా
ఇరాన్‌ను ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయెల్‌ లక్ష్యాలు ఉంటాయని సైనిక నిపుణులు భావిస్తున్నారు. చమురు, గ్యాస్‌, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్‌ వంటివి తమ లక్ష్యాలుగా మారతాయని ఐడీఎఫ్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. టెహ్రాన్‌ యుద్ధ విమానాలు, క్షిపణి తయారీ కేంద్రాలను కూడా ధ్వంసం చేయొచ్చని చెప్పారు. అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మ‌ధ్య ఉద్రిక్తత‌లు తీవ్రమైతే అమెరికాతోపాటు పాశ్చాత్య కూట‌మి రంగంలోకి దిగే అవ‌కాశ‌ముంది. యుద్ధం మ‌రిన్ని దేశాల‌కు విస్తరించే ప్రమాద‌ం ఉంది.

భగ్గుమన్న పశ్చిమాసియా- ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌- రంగంలోకి అమెరికా! - Iran Fired Missiles At Israel

'ఆ విషయంలో భారత్ కట్టుబడి ఉంది' - నెతన్యాహుకు మోదీ ఫోన్ - PM Modi Speaks With Netanyahu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.