ETV Bharat / international

ఇజ్రాయెల్- హెజ్​బొల్లా మధ్య 21రోజుల కాల్పుల విరమణ- నెతన్యాహు గ్రీన్ సిగ్నల్! - Israel Hezbollah Ceasefire

Israel Hezbollah Ceasefire : ఇజ్రాయెల్, హెజ్​బొల్లా మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో 21రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి.

Israel Hezbollah Ceasefire
Israel Hezbollah Ceasefire (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 11:29 AM IST

Updated : Sep 26, 2024, 2:49 PM IST

Israel Hezbollah Ceasefire : హెజ్​బొల్లా- ఇజ్రాయెల్‌ పరస్పర దాడులతో ఆ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇటీవలే హెజ్​బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్​పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హెజ్​బొల్లా మధ్య కాల్పుల విరామం కోసం అమెరికా, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో 21 రోజుల కాల్పుల విరమణ ఇవ్వాలని పిలుపునిచ్చాయి.

'ఈ దాడులు చాలా ప్రమాదకరం'
అలాగే కాల్పుల విరమణపై చర్చలు జరపాలని ఇరు దేశాలను యూఎస్, ఫ్రాన్స్ సహా ఆస్ట్రేలియా, కెనడా, ఈయూ, జర్మనీ, ఇటలీ, జపాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు కోరాయి. న్యూయార్క్​లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ దాడులు చాలా ప్రమాదకరమని హెచ్చరించాయి. ఇజ్రాయెల్- హెజ్​బొల్లా సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి.

'ఇరుదేశాల సరిహద్దుల్లో మాత్రమే'
తమ మిత్రదేశాలన్నీ హెజ్​బొల్లా- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే లెబనాన్, ఇజ్రాయెల్​తో సంధిపై చర్చిస్తామని వెల్లడించారు. కాల్పుల విరమణపై హెజ్​బొల్లా సంతకం చేయదని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై లెబనాన్ ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. ఈ కాల్పుల విరమణ పిలుపు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.

ఇజ్రాయెల్​తో సంప్రదింపులు
అలాగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణపై కూడా యూఎస్ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం ఆగిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా మూడు వారాల కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా, యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్​తో అధ్యక్షుడు జో బైడెన్ హెజ్​బొల్లా- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై చర్చించారని పేర్కొన్నారు. అలాగే బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మధ్య కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని తెలిపారు. కాల్పుల విరమణ అంశంపై ఇజ్రాయెల్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

'యుద్ధమే పరిష్కారం కాదు'
మరోవైపు, తాము హెజ్​బొల్లా, ఇజ్రాయెల్ ఆలస్యం చేయకుండా కాల్పుల విరమణ సంధిని చేసుకోమని కోరుతున్నామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ తెలిపారు. అన్ని సమస్యలకు యుద్ధమే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే బంధీలుగా ఉన్నదేశ పౌరులను అప్పగించాలని కోరుతున్నారని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి కూడా కాల్పుల విరమణపై స్పందించారు. లెబనీస్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణకు హామీ ఇవ్వాలని కోరారు. అప్పుడు కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు - 5 రోజుల్లో 90 వేల మంది నిరాశ్రయులు! - Israel Hezbollah War

'రష్యాపై పోరుకు సహకరిస్తే మీరూ మాపై దాడిచేసినట్లే' - అణు దేశాలకు పుతిన్‌ వార్నింగ్ - Russia Ukraine war

Last Updated : Sep 26, 2024, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.