ETV Bharat / international

మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్​- సరకు రవాణా నౌకపై క్షిపణి దాడులు- ముగ్గురు మృతి - houthis attack ship

Houthi Rebels Attack Ship : గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో సరకు రవాణా నౌకపై హౌతీ రెబల్స్ డ్రోన్‌ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో నౌకలో ఉన్న ముగ్గురు సిబ్బంది మరణించారు.

Houthi Rebels Attack Ship
Houthi Rebels Attack Ship
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 6:48 AM IST

Houthi Rebels Attack Ship : గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో హూతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. బుధవారం బార్బడోస్ జెండాతో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపై యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణితో భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఆరుగురు గాయపడ్డారని అమెరికా తెలిపింది.

క్షిపణి దాడి జరగడం వల్ల ఓడలోని మిగతా సిబ్బంది వెంటనే అందులో నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. అమెరికా యుద్ధనౌక, భారత నేవీ వారికి లైఫ్ బోట్ల ద్వారా సాయం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హూతీలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

దాడులను తిప్పికొట్టిన అమెరికా
Houthi Rebels Attack US Ships : అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై ఇటీవలే హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. కొన్ని నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించినట్లు హూతీ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ప్రకటించారు. తమ దళాలు క్షిపణులను సమర్థవంతంగా కూల్చివేసినట్లు అమెరికా వెల్లడించింది. ఎదురు దాడి చేసి యెమెన్‌ భూభాగంలోని మూడు క్షిపణులు, మరికొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

తెగిపోయిన డేటా కేబుల్స్
ఎర్ర సముద్రంలో మూడు డేటాకేబుల్స్‌ తెగిపోయినట్లు టెలికాం సంస్థలు, ఓ అమెరికా ప్రభుత్వాధికారి ధ్రువీకరించినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఆసియా-ఐరోపా మధ్య దాదాపు 25శాతం డేటా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. హెచ్‌జీసీ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ స్పందిస్తూ ఆ ట్రాఫిక్‌ను వేరే కేబుల్స్‌కు మళ్లించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎలా తెగిపోయాయో కారణం మాత్రం వెల్లడించలేదు.

వాస్తవానికి సముద్రం అడుగున ఏర్పాటుచేసిన డేటా కేబుల్సే ఇంటర్నెట్‌ను నడిపించే అదృశ్య శక్తి. గత కొన్నేళ్లుగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి కంపెనీలు దీనిలో భారీ ఎత్తున నిధులను పెట్టుబడిగా పెట్టాయి. ఈ కేబుల్స్‌ దెబ్బ తింటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. 2006లో తైవాన్‌ భూకంపం సందర్భంగా ఒకసారి ఈ కేబుల్స్‌ దెబ్బతిని ఇంటర్నెట్‌ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి.

భారత్​పై హౌతీ దాడుల ఎఫెక్ట్ నో​- ఫ్యాక్టరీలు మూసేస్తున్న ఐరోపా దేశాల్లోని కంపెనీలు!

ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.