ETV Bharat / international

ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు- ఏకంగా రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం- అర్హతలు ఇవే! - Government Free Money Distribution - GOVERNMENT FREE MONEY DISTRIBUTION

Government Free Money Distribution : అర్హులైన దేశ ప్రజలందరికీ ఉచితంగా నగదు వితరణ చేయాలని థాయ్​లాండ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఖర్చు చేసేందుకు ఈ డబ్బు పంపిణీ చేయనుంది. అసలు ఈ స్కీం ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? అనే వివరాలు మీకోసం.

Government Free Money Distribution
Government Free Money Distribution (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 2:23 PM IST

Government Free Money Distribution : దేశ ప్రజల అకౌంట్లలో ప్రభుత్వం ఫ్రీగా డబ్బులను జమచేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది థాయ్​లాండ్​ ప్రభుత్వం. ఈ స్కీమ్‌ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఫ్రీ మనీ అందించేందుకు తాము సిద్ధమని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి స్రెథ్థా థావిసిన్ ప్రకటించారు. అర్హతగల వ్యాపారులు, వ్యక్తులు వచ్చే నెల 1 నుంచి ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. డిజిటల్ వ్యాలెట్(Digital Wallet) పేరుతో ఈ స్కీంను అమలు చేస్తామని తెలిపారు. దీనివల్ల దేశంలో ఆర్థిక పురోగతికి మార్గం సుగమం అవుతుందని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 1.2 శాతం నుంచి 1.6 శాతానికి పెరుగుతుందన్నారు. ఈ మేరకు వివరాలతో ప్రధాని థావిసిన్ ఎక్స్​లో ఓ పోస్ట్ చేశారు.

అప్లై చేయడానికి అర్హతలివీ
డిజిటల్ వ్యాలెట్ స్కీం ద్వారా దాదాపు 5 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని థాయ్‌లాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ స్కీంకు 16 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరినీ అర్హులుగా పరిగణించాలని తొలుత భావించారు. కానీ ఈ నిబంధనను మార్చేసి, తక్కువ ఆదాయ వర్గాలకు మాత్రమే దరఖాస్తు చేసే అవకాశం ఇచ్చారు. రూ.19 లక్షలలోపు వార్షిక ఆదాయం, రూ.11 లక్షలలోపు పొదుపు మొత్తాలు కలిగిన వారు మాత్రమే అప్లై చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి ఎంపికయ్యే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.23వేలు (10వేల బహ్త్‌లు) చొప్పున డిజిటల్ మనీని జమ చేయనున్నారు. కేవలం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండే ఈ డబ్బును ఏయే అంశాలపై ఖర్చు పెట్టొచ్చు? అనే దానిపై థాయ్‌లాండ్ వాణిజ్య శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనుంది. ఈ డిజిటల్ మనీని కొన్ని వస్తువులు/ సేవల కొనుగోళ్లపై ఖర్చు చేయకుండా పరిమితిని విధించనున్నారు. ఈ విధంగా మినహాయించే విభాగాల్లో చమురు కొనుగోళ్లు, సేవలు, ఆన్​లైన్ కొనుగోళ్లు వంటి కేటగిరీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

'పథకం అమలు అంత ఈజీ కాదు'
ఈ స్కీం అమలు అంత ఈజీ కాదని విపక్షాలు, పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న థాయ్‌లాండ్‌ను డిజిటల్ వ్యాలెట్ స్కీం దివాలా తీసే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిజిటల్ వ్యాలెట్ స్కీంకు స్టేట్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్‌ నుంచి నిధులు పొందాలని తొలుత భావించినప్పటికీ, ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంది. 2024-25 దేశ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ స్కీంను భాగం చేయాలని నిర్ణయించింది.

'రూ.లక్ష కోట్లు చాలు'
అయితే, ఆర్థిక నిపుణుల వాదనను థాయ్‌లాండ్ ఆర్థిక శాఖ ఉప మంత్రి జులపాన్ అమోర్న్‌వివాట్ తాజాగా మీడియా సమావేశంలో ఖండించారు. డిజిటల్ వ్యాలెట్ స్కీం‌కు రూ.1.10 లక్షల కోట్లు అవసరం అవుతాయని తొలుత భావించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం కేవలం రూ.లక్ష కోట్లు సరిపోతాయని తేలిందన్నారు. ఎన్నికల హామీని నెరవేర్చే విషయంలో తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఈ తరహా స్కీం ద్వారా లబ్ధి పొందిన వారు కూడా మళ్లీ అప్లై చేయొచ్చన్నారు. అయితే గతంలో ఈ స్కీం ద్వారా మోసపూరిత లబ్ధిపొందిన వారికి ఈసారి దరఖాస్తు చేసే అర్హత ఉండదని స్పష్టం చేశారు.

'యుద్ధాన్ని ఆపమని పుతిన్కు మీరైనా చెప్పండి' - భారత్‌కు అమెరికా విజ్ఞప్తి - Russia Ukraine War

స్నేక్​​ పాయిజన్​తో రూ.కోట్లు సంపాదిస్తున్న గిరిజనులు! ఒక్కో పాముకు ఒక్కో రేటు! ఎక్కడో తెలుసా? - World Snake Day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.