ETV Bharat / international

ఉక్రెయిన్‌కు జీ7 దేశాల సాయం- రష్యా ఆస్తుల లాభాలతో 50 బిలియన్ డాలర్ల లోన్​కు గ్రీన్ సిగ్నల్! - UKRAINE LOAN

రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం నేపథ్యంలో కీవ్​కు జీ7 దేశాల ఆర్థిక సాయం - రుణంగా 50 బిలియన్‌ డాలర్లు

G7 Countries Loan To Ukraine
G7 Countries Loan To Ukraine (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 1:05 PM IST

Updated : Oct 26, 2024, 2:43 PM IST

G7 Countries Loan To Ukraine : రష్యా దురాక్రమణ చర్యతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. యుద్ధం కారణంగా నష్టపోయిన ఉక్రెయిన్‌ పునర్నిర్మానానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జీ7 దేశాల నాయకులు ప్రకటించారు. ఆయా దేశాల్లో జప్తు చేసిన రష్యా ఆస్తులను అమ్మగా వచ్చిన లాభాల్లో 50 బిలియన్ల యూఎస్‌ డాలర్ల రుణం ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఇందులో 20 బిలియన్ల డాలర్ల రుణాన్ని ఒక్క అమెరికానే అందించనుంది.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మెుదలై దాదాపు రెండేళ్లు దాటుతోంది. రష్యా బలగాలు దాడులతో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టం పోయింది. ప్రాణనష్టంతో పాటు ఆర్థికంగా కూడా ఉక్రెయిన్‌ భారీ నష్టాన్ని చవిచూసింది. కీవ్‌లో కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఇందులోభాగంగా ఉక్రెయిన్‌కు దాదాపు 50 బిలియన్ల యూఎస్‌ డాలర్లు (సుమారు రూ.42,000 కోట్లు) అందించనున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న జీ7 దేశాల నాయకులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అండగా ఉండాలని ఆ దేశ పునర్నిర్మానానికి ఆర్థిక రుణం అందిచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

రష్యా ఆస్తుల లాభాల నుంచి!
అయితే ఈ రుణాన్ని జీ7 దేశాల్లో ఆయా దేశాలు జప్తు చేసిన రష్యా ఆస్తులను అమ్మగా వచ్చిన లాభాల్లో నుంచి ఈ ఆర్థిక రుణాన్ని ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌పై దాడులను ప్రారంభించిన వెంటనే తమ దేశాల్లో ఉన్న రష్యాకు చెందిన ఆస్తులను జీ7 దేశాలు అధీనంలోకి తీసుకొన్నాయి. వీటిపై వచ్చిన లాభాలను ఉక్రెయిన్‌కు రుణంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల పంపిణీ ఎలా అందించాలనే దానిపై జీ7 దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ రుణాన్ని బహుళ మార్గాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిధుల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ ఆర్థిక, సైనిక, పునర్నిర్మాణ సాయానికి మద్దతు ఇచ్చేందుకు రుణ ఆదాయాన్ని అందించాలని నిర్ణయించకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌కు అవసరమైన మద్దతును అందించేందుకు ఎప్పుడు ముందుటామని జీ7 దేశాల నేతలు పునరుద్ఘాటించారు. మాస్కో తన యుద్ధాన్ని ముగించి ఉక్రెయిన్‌కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

అమెరికా నుంచే ఎక్కువ
50 బిలియన్ల డాలర్ల రుణాల్లో ఎక్కువ మెుత్తం అమెరికా నుంచే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. దాదాపు 20 బిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌కు అమెరికా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు. ఇందులో పది బిలియన్ల డాలర్లను ఆర్థిక రుణంగా అందించనుండగా మిగిలిన మెుత్తాన్ని సైనిక సహాయంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 బిలియన్‌ డాలర్లలో మిగిలిన 30 బిలియన్‌ డాలర్ల రుణాలు ఐరోపా, యూకే, కెనడా, జపాన్‌తో సహా జీ7 భాగస్వామ్య దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతాయి.

Last Updated : Oct 26, 2024, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.