France Election Results 2024 : ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పార్టీకి అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ వచ్చేలా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వేచి చూస్తున్నారని ఎలీసీ ప్యాలెస్ తెలిపింది. తుది ఫలితాల వరకు వేచి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియెల్ అట్టల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికలు
ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదని సమచారం. 577 స్థానాలున్న ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 289 సీట్లు సాధించాలి. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యరీతిలో వామపక్ష కూటమి పుంజుకుంది. సోమవారం ఉదయానికి వెలువడిన ఫలితాల ప్రకారం వామపక్ష కూటమి 180 స్థానాల్లో విజయం సాధించింది. మెక్రాన్ కూటమి 160 స్థానాలతో రెండో స్థానంలో, అతి మితవాద కూటమి 140 సీట్లలో విజయంతో మూడోస్థానంలో నిలిచింది. ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈసారి అతి మితవాద పక్షాలతో కలిసి పాలన సాగించడం అనివార్యమయ్యేలా ఉంది. అంటే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హంగ్ తప్పేలా లేదు.
ఒకవేళ ఫ్రాన్స్‌లో హంగ్ వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే యూరోపిన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్ లో యుద్ధం, ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు, ఐరోపా ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఆధారంగా జాతీయ అసెంబ్లీని ఏ పార్టీ దక్కించుకుంటుంది, ప్రధాని పగ్గాలు ఎవరికి దక్కుతాయి అనేవి తేల్చనున్నాయి.
ఫ్రాన్స్‌లో హింస
ఫ్రాన్స్ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్ వెల్లడించిన నేపథ్యంలో పారిస్, ఇతర నగరాల్లో ఆదివారం హింస చెలరేగింది. పారిస్ వీధుల్లో మాస్కులు ధరించిన నిరసనకారులు పరుగులు తీశారు. అలాగే మంటలను అంటించారు. కాగా, ముందస్తు ఎన్నికల్లో ఊహించని విధంగా వామపక్ష కూటమి పుంజుకోవడం వల్ల ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియేల్ అట్టల్ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్యారెస్ ప్లేస్ డిలా రిపబ్లిక్ వద్ద వేలాది మంది గుమిగూడారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగింది.
ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగాలని డిమాండ్- కమలకు ఫుల్ సపోర్ట్! - US Elections 2024
యూఎస్ ప్రతిపాదనలకు హమాస్ అంగీకారం - బందీల విడుదలకు సిద్ధం - కానీ! - Hamas Agrees To US Proposal