Trump Campaign Email Hacked : అమెరికా ఎన్నికల్లో ఇరాన్ జోక్యం ఉందంటూ మైక్రోసాఫ్ట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం పలు ఆరోపణలు చేసింది. తమ ఈ-మెయిళ్లు హ్యాకయ్యాయని, ఇది ఇరాన్ మద్దతున్న బృందాల పనేనని ఆరోపించింది. అవి తమకు చెందిన కీలక అంతర్గత సమాచారాన్ని తస్కరించి బహిర్గతం చేస్తున్నాయని పేర్కొంది. అయితే దీని వెనక ఇరాన్ ప్రభుత్వ హస్తం ఉందని చెప్పేలా కచ్చితమైన ఆధారాలను ట్రంప్ బృందం వెల్లడించలేదు.
Iran Cyber Attack On Us Election : అమెరికా ఎన్నికలను, ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో ఆరోపించింది. ఎన్నికల ప్రచారాలే లక్ష్యంగా ఈ-మెయిల్ ఫిషింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. కొన్ని బృందాలు కలిసి గతకొన్ని నెలలుగా ఈ విషయంపైనే పనిచేస్తున్నట్లు పేర్కొంది. నకిలీ వార్తా వెబ్‌సైట్ల సృష్టించడం, సామాజిక కార్యకర్తల్లా నటిస్తూ, వివిధ మార్గాల్లో ఓటర్ల మధ్య విభజన తేవడం కోసం యత్నిస్తున్నారని ఆరోపించింది.
విదేశీ జోక్యాన్ని సహించం
ట్రంప్ ప్రచార బృందం ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపర్చేందుకు చేసే ఎలాంటి కార్యకలాపాలనైనా సహించేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ట్రంప్ వర్గాల ఆరోపణలను ఐరాసలోని ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపారు.
ట్రంప్ హత్యకు కుట్ర
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటుగా కొందరు రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ఓ పాకిస్థానీ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు. నిందితుడికి ఇరాన్‌తో బలమైన సంబంధాలున్నట్లు గుర్తించినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్‌వ్రే వెల్లడించారు. దీనిని ఇరాన్ చేయించే కిరాయి హత్య కుట్రగా క్రిస్టఫర్‌వ్రే పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
నాడు టిమ్ వాల్జ్‌ను మెచ్చుకుంటూ - ఇప్పుడు కాదంటూ - ట్రంప్ భిన్న స్వరాలు! - Trump About Tim Walz
ట్రంప్ హత్యకు పాకిస్థానీ కుట్ర - నిందితుడిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ - Iran conspiracy to kill Trump