Democratic President Contenders : డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం వల్ల ఆ స్థానాన్ని దక్కించుకునేదెవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పలువురు కీలక నేతలు డెమొక్రటిక్ అభ్యర్థిత్వనాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో ఉపాధ్యక్షురాలు కమలా కమహా హారిస్ ముందున్నారు. ఇప్పటికై బైడెన్ కూడా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారెవరో తెలుసుకుందాం.
కమలా హారిస్
- కమలా హారిస్(59) కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు.
- అమెరికా తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించారు.
- కమలా హరిస్ తండ్రి ఆర్థికవేత్త. తల్లి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్.
- కమలా హారిస్‌ను బైడెన్ నిర్భయ పోరాట యోధురాలిగా అభివర్ణించారు.
- హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.
- రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
- లాస్ ఏంజిల్స్ న్యాయవాది డగ్లస్ ఎమ్హాఫ్ను ఆమె వివాహం చేసుకున్నారు.
జేబీ ప్రిట్జ్కర్
- జేబీ ప్రిట్జ్కర్ ప్రస్తుతం ఇల్లినాయీ గవర్నర్‌గా ఉన్నారు.
- అమెరికాలో అత్యంత ధనిక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు.
- ప్రిట్జ్కర్ నికర ఆస్తుల విలువ 3.4 బిలియన్ డాలర్లు
- అమెరికా రాజ్యాంగ సవరణలకు మద్దతు ఇచ్చారు.
- "థింక్ బిగ్ అమెరికా" అనే నినాదంతో ప్రజల మద్దతు పెంచుకున్నారు.
గ్రెచెన్ విట్మెర్
- గ్రెచెన్ విట్మెర్ మిషిగన్ గవర్నర్‌గా ఉన్నారు.
- శాసనసభలో ఒకటిన్నర దశాబ్దంపాటు పనిచేశారు.
- డెమొక్రటిక్ పార్టీలో వేగంగా ఎదిగిన మహిళా నేతగా గుర్తింపు పొందారు.
- డెమొక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన స్పీకర్‌గా ఉన్నారు.
- అబార్షన్ హక్కులపై గళం విప్పి మహిళలను ఆకట్టుకున్నారు.
- అధ్యక్ష అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు.
- జాతీయ రాజకీయ కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు విట్మెర్
గావిన్ న్యూసమ్
- గావిన్ న్యూసమ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్నారు.
- 1995లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
- 2004లో స్వలింగ జంటలకు వివాహ లైసెన్సును జారీ చేసి అందరి దృష్టి ఆకర్షించారు.
- బైడెన్‌ను బలమైన నమ్మకస్థుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
- గావిన్‌కు కాలిఫోర్నియా అంతటా రెస్టారెంట్లు, రిసార్ట్లు ఉన్నాయి.
జోష్ షాపిరో
- జోష్ షాపిరో పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఉన్నారు.
- పెన్సిల్వేనియాలో ఎదుగుతున్న రాజకీయ స్టార్‌గా ఆయనను చూస్తారు.
- ట్రంప్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఓడించి గవర్నర్‌గా రెండోసారి అధికారం చేపట్టారు.
- రెండుసార్లు అటార్నీ జనరల్‌గా, ఒకసారి గవర్నర్‌గా చేశారు.
- హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించారు.
రాయ్ కూపర్
- ఉత్తర కరొలినా డెమొక్రటిక్ గవర్నర్‌గా ఉన్నారు.
- ఆరు సాధారణ ఎన్నికల్లో విజయం కేతనం ఎగరేశారు.
- పరిపాలన, చట్టసభలపై మంచి అవగాహన ఉంది.
- ప్రభుత్వ విద్య, అబార్షన్ హక్కుల కోసం పోరాడారు.
- రాయ్ కూపర్ న్యాయ విద్యను అభ్యసించారు.
ఆండీ బెషీర్
- ఆండీ బెషీర్ కెంటకీ గవర్నర్‌గా ఉన్నారు.
- ట్రంప్ ఆమోదించిన రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించి స్టార్‌గా గుర్తింపు పొందారు.
- గత ఏడాది రెండోసారి కూడా ఎన్నికల్లో గెలుపొందారు.
- అబార్షన్ హక్కులకు మద్దతు ఇచ్చారు.
- కెంటకీలో అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు.
- బెషీర్ 2015లో అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
మార్క్ కెల్లీ
- మార్క్ కెల్లీ అరిజోనాకు చెందిన సెనెటర్.
- వ్యోమగామిగా పనిచేసి దేశం దృష్టిని ఆకర్షించారు.
- కెల్లీ గత ఎన్నికల్లో ఇతర డెమొక్రాట్ల కంటే ఎక్కువ ఓట్లను సంపాదించారు.
- రాజకీయ హింసకు కెల్లీ కుటుంబం బలైపోయింది.
- గన్ నియంత్రణకు కెల్లీ పోరాటం చేస్తున్నారు.
- నాసాలో చేరడానికి ముందు గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్నారు.
- స్పేస్ షటిల్లో మూడు మిషన్లకు నేతృత్వం వహించారు.
కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ - ఇంకా ఏమీ తేల్చని ఒబామా, పెలోసీ - Us Elections 2024