Congo Bus Accident : కాంగో రాజధాని కిన్షాసాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. స్థానిక ఎన్‌డిజిలి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో మలుపు తిరగడానికి ప్రయత్నించిన బస్సు, ఓ ట్రక్కును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
పడవలో అగ్నిప్రమాదం-16 మంది మృతి
గతేడాది అక్టోబర్‌లో కాంగోలో ఇంధనంతో వెళుతున్న ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. ఘటనలో 11 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ ఇందనాన్ని లోడ్ చేసుకుని.. ఎమ్బండకా నుంచి రాజధాని కిన్షాసా వరకు వెళ్తోందని అన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే సహయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
19 మంది మృతి
ఇటీవల మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోల 19 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల జరిగిందీ దుర్ఘటన. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని జాతీయ రహదారిపై సరుకులను రవాణా చేసే ట్రక్కు, బస్సు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.
చైనా ఫైర్ యాక్సిడెంట్
China Fire Accident : మరోవైపు ఇటీవలే చైనాలో ఓ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అందులో 39 మంది మరణించారు. ఆగ్నేయ జియాంగ్జీ ప్రావిన్స్‌లో జరిగిందీ దుర్ఘటన. ఓ షాపింగ్ మాల్ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదాలు పదే పదే జరగకుండా చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు.
ఎన్నికల వేళ పాక్‌లో జంట పేలుళ్లు- 30మంది దుర్మరణం
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జీవి 'దోమ'- టాప్ 10 లిస్ట్‌లో ఇంకా ఏమున్నాయంటే?