ETV Bharat / international

ప్రజల ఓట్లు ఎక్కువొచ్చినా అమెరికా అధ్యక్ష పీఠం గ్యారెంటీ లేదు! ఆ ఓట్లే ముఖ్యం! - US ELECTIONS 2024

నవంబరు 5న యూఎస్ అధ్యక్ష ఎన్నికలు- పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా అధ్యక్షుడు అవ్వడం కష్టమే! ఆ ఓట్లే కీలకం

US Elections 2024
US Elections 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 2:55 PM IST

US Elections 2024 : అమెరికా ఎన్నికల ప్రక్రియ ఇతర దేశాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రజల ఓట్లు ఎక్కువ వచ్చిన అభ్యర్థి కొన్నిసార్లు ఓడిపోతారు. ఓట్లు తక్కువ వచ్చినా కొందరు గెలుస్తారు. అందుకు కారణం ఎలక్టోరల్ కాలేజ్. అమెరికాలో మొత్తం 540 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 370 ఓట్లు సాధించినవారు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. అలాగే కొన్ని వేల ఓట్లు, ఒక రాష్ట్రం అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల చరిత్రలో పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చి, ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు తక్కువ రావడం వల్ల ఓడిన అభ్యర్థులు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆండ్రూ జాక్సన్ వర్సెస్ జాన్ క్విన్సీ ఆడమ్స్
1824లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రూ జాక్సన్ కంటే జాన్ క్విన్సీ ఆడమ్స్ ఎక్కువ పాపులర్ ఓట్లను సాధించారు. అయితే ఎలక్టోరల్ కాలేజ్​లో ఆడమ్స్ కంటే ఆండ్రూ జాక్సన్ ఒక్క ఓటు ఎక్కువగా పొందారు. దీంతో అధ్యక్ష పీఠం ఆండ్రూ జాక్సన్ వశమైంది.

జేమ్స్ నాక్స్ పోల్క్ వర్సెస్ హెన్రీ క్లే
1844 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ నాక్స్ పోల్క్ తన ప్రత్యర్థి హెన్రీ క్లేపై 1.4శాతం ఎక్కువ పాపులర్ ఓట్లను పొందారు. అయినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో వెనుకబడ్డారు. దీంతో హెన్రీ క్లేపై 65 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

రూథర్‌ ఫర్డ్ హేస్ వర్సెస్ శామ్యూల్ టిల్డెన్
1876లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రూథర్ ఫర్ట్ కన్నా శామ్యూల్ టిల్డెన్ 3శాతం పాపులర్ ఓట్లను అధికంగా పొందారు. అయినప్పటికీ 1 ఎలక్టోరల్ కాలేజ్ ఓటు తేడాతో ఓటమిపాలయ్యారు. రూథర్ ఫర్ట్ కు 185 ఎలక్టోరల్ ఓట్లు దక్కగా, శామ్యూల్ కు 184 వచ్చాయి.

జేమ్స్ ఏ గార్ఫీల్డ్ వర్సెస్ విన్‌ ఫీల్డ్ స్కాట్ హాన్‌ కాక్
1880లో జరిగిన అధ్యక్ష పోరులో రిపబ్లికన్ నామినీ జేమ్స్ ఎ. గార్ఫీల్డ్ తన ప్రత్యర్థి విన్‌ ఫీల్డ్ స్కాట్ కంటే 1శాతం ఎక్కువ పాపులర్ ఓట్లను పొందారు. అయితే ఎలక్టోరల్ కాలేజీలో 155 ఓట్లే దక్కడం వల్ల ఓటమిపాలయ్యారు. విన్‌ ఫీల్డ్ స్కాట్ కు ఏకంగా 214 ఎలక్టోరల్ ఓట్లు పొందారు.

గ్రోవర్ క్లీవ్‌ ల్యాండ్ వర్సెస్ జేమ్స్ బ్లెయిన్
1884 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ నేత గ్రోవర్ క్లీవ్‌ ల్యాండ్ తన ప్రత్యర్థి జేమ్స్ బ్లెయిన్ పై 37 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల తేడాతో గెలుపొందారు. క్లీవ్‌ ల్యాండ్ తన స్వరాష్ట్రం న్యూయార్క్ లో కేవలం 1,047 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఆయనకు విజయం వశమైంది.

బెంజమిన్ హారిసన్ వర్సెస్ గ్రోవర్ క్లీవ్‌ ల్యాండ్
1888లో జరిగిన ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ పై జెంజిమిన్ హారిసన్ విజయం సాధించారు. పాపులర్ ఓట్లతో గ్రోవర్ క్వీవ్ ల్యాండ్ దూకుడు కనబర్చినా ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో వెనుకబడ్డారు. దీంతో 65 ఓట్ల తేడాతో పరాజయం పొందారు.

వుడ్రో విల్సన్ వర్సెస్ చార్లెస్ హ్యూస్
1916లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వుడ్రో విల్సన్ తన ప్రత్యర్థి ఛార్లెస్ హ్యూస్‌ పై 23 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో గెలుపొందారు. విల్సన్ కాలిఫోర్నియాలో కేవలం 3,800 ఓట్లతో గెలుపొందారు. దీంతో అతడికి విజయం సొంతమైంది. అలాగే 1960లో జరిగిన ఎన్నికల్లో జాన్ కెన్నడీ తన ప్రత్యర్థి రిచర్డ్ నిక్సన్‌ పై గెలుపొందారు.

జార్జ్ డబ్ల్యూ బుష్ వర్సెస్ అల్ గోర్
2000లో జరిగిన యూఎస్ ఎన్నికల్లో జార్జ్ డబ్ల్యూ బుష్ కన్నా డెమోక్రటిక్ అభ్యర్థి అల్ గోర్ ఎక్కువ పాపులర్ ఓట్లను పొందారు. అయితే ఎలక్టోరల్ కాలేజ్ లో బుష్ కన్నా 5 తక్కువ పడడం వల్ల ఓటమి పాలయ్యారు అల్ గోర్.

జార్జ్ డబ్ల్యూ బుష్ వర్సెస్ జాన్ కెర్రీ
2004లోనూ జార్జ్ డబ్ల్యూ. బుష్ 35 ఎలక్టోరల్ ఓట్లతో డెమొక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీపై విజయం సాధించారు. ఒహియో రాష్ట్రంలో రాణించడం వల్ల బుష్ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టారు.

డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ హిల్లరీ క్లింటన్
2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే పాపులర్ ఓట్లలో హిల్లరీ క్లింటర్ పైచేయి సాధించారు. అయినప్పుటీ ఎలక్టోరల్ కాలేజ్ లో ట్రంప్ నకు ఓట్లు అధికంగా రావడం వల్ల ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.