ETV Bharat / international

చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్​ దాడి!

China Cyber Attack On India : చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై భారీ సైబర్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్‌ సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు అమెరికాకు చెందిన 'ది వాషింగ్టన్​ పోస్ట్​' కథనం ప్రచురించింది. కేవలం భారత్‌ నుంచే దాదాపు 95జీబీ ఇమిగ్రేషన్​ డేటాను చైనా హ్యాకింగ్ ముఠా తస్కరించినట్లు అందులో పేర్కొంది.

China Cyber Attack On India
China Cyber Attack On India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 9:51 PM IST

China Cyber Attack On India : చైనా హ్యాకర్ల ముఠా భారత్​ సహా పలు దేశాలు, సంస్థలపై సైబర్​ దాడులకు పాల్పడినట్టు 'ది వాషింగ్టన్​ పోస్ట్​' ఓ కథనంలో వెల్లడించడం కలకలం రేపుతోంది. చైనా ప్రభుత్వం మద్దతున్న హ్యాకింగ్‌ సంస్థ 'ఐసూన్‌'కు చెందిన పలు కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయనీ ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు ఆ కథనం వెల్లడించింది. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు భారీ సైబర్​ దాడులకు పాల్పడినట్లు అందులో తేలిందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్​, యాపిల్​, గూగుల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్​ వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకుని డ్రాగన్​ హ్యకర్లు ఈ దాడులు చేసినట్లు 'ది వాషింగ్టన్ పోస్ట్​' తెలిపింది.

మరో 19 దేశాలపైనా సైబర్​ పంజా!
లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న 'ఐసూన్​' అనే కంపెనీకి చెందినవని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. గత వారం అవి గిట్‌హబ్‌లో వెలుగుచూశాయనీ చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్​ పార్టీ హ్యాకింగ్‌ సేవలు అందిస్తోందని పేర్కొంది. సైబర్‌ దాడులు చేసి విదేశీ సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లతో చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. భారత్‌, యూకే, తైవాన్‌, మలేసియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు తేలిందని 'ది వాషింగ్టన్​ పోస్ట్​' తెలిపింది. ఈ పత్రాలు ఎలా లీక్‌ అయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

95.2 జీబీ డేటా తస్కరణ!
'ఐసూన్​' హ్యాకర్లు విదేశాల్లోని 80 టార్గెట్​ పాయింట్​ల నుంచి డేటాను అపహరించినట్లు లీకైన పత్రాల్లో ఉందని సమాచారం. భారత్‌ నుంచి దాదాపు 95.2 గిగాబైట్ల ఇమిగ్రేషన్‌ డేటాను సేకరించారనీ, దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్​ నుంచి 3 టెరాబైట్ల కాల్‌ లాగ్స్‌ సమాచారాన్ని దొంగిలించారని 'ది వాషింగ్టన్‌ పోస్ట్‌' కథనం వెల్లడించింది. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

25రోజులు పచ్చి చికెన్ తిన్న వ్యక్తి- నో ఫుడ్ పాయిజన్​- ఎలా సాధ్యమైంది?

'నేనేం మలాలాను కాను- పరిగెత్తి వేరే దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.