6: 30 PM
భారత్‌లో అడుగుపెట్టిన షేక్ హసీనా
- ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్ చేరుకున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా
- హిండన్ ఎయిర్‌బేస్‌లో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా విమానం ల్యాండింగ్
- బంగ్లాదేశ్‌కు చెందిన సీ-130 విమానంలో వచ్చి ప్రధాని షేక్ హసీనా
- సీ-130 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే గాల్లోకి ఎగిరిన భారత వైమానిక దళం యుద్ధ విమానాలు
- కొద్దిసేపు సీ-130 విమానాన్ని అనుసరించిన భారత ఫైటర్ జెట్స్
6:20 PM
ఢాకాకు ఎయిర్ఇండియా విమాన సర్వీసులు రద్దు
- బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల దృష్ట్యా ఢాకాకు విమాన సర్వీసుు రద్దు చేసిన ఎయిర్ఇండియా
- ఇప్పటికే టికెట్లు కొన్న ప్రయాణికులకు అన్నివిధాలా సహకరిస్తామని ప్రకటన
- ప్రయాణికులు, సిబ్బంది భద్రత అత్యంత కీలకమని పేర్కొన్న ఎయిరిండియా
6:15 PM
ఢాకాలోని బంగబంధు మెమోరియల్ మ్యూజియంకు నిప్పు అంటించిన నిరసనకారులు
5:33 PM
- దిల్లీ చాణక్యపురిలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద పకడ్బంది భద్రత
- ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంబంధిత చర్యలు
- కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన రైల్వే అధికారులు
5.30 PM
బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో బంగాల్లో శాంతి భద్రతలు కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
3:53 PM
లండన్‌కు హసీనా!
షేక్ హసీనా, త్రిపుర రాజధాని అగర్తలకు చేరుకున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి లండన్‌కు వెళ్లనున్నారని సమాచారం.
మరోవైపు, బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఈ పరిణామాల వేళ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలని యత్నించే ప్రతిఒక్కరిని అడ్డుకోవాలని సైన్యాన్ని కోరారు. "ప్రజలను, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం మీ బాధ్యత. ఎన్నిక కాని ప్రభుత్వం అధికారంలో కూర్చోవడానికి ఒక్క నిమిషం కూడా అనుమతించ్చొద్దు. ప్రధానిని గద్దె దించితే మనం సాధించిన అభివృద్ధి అంతా మట్టిలో పోసినట్టవుతుంది. తిరిగి మళ్లీ పుంజుకోలేదు. మనం అలాంటి పరిస్థితిని కోరుకోం" అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆయన ప్రధానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.
3:53 PM
భారత్- బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ హైఅలర్ట్
బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించడం వల్ల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ హైఅలర్ట్ ప్రకటించింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌధరి, ఇతర సీనియర్ అధికారులు కోల్‌కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌తో, భారత్ 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది.
3:40 PM
- రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్
- చర్చల తర్వాత బంగ్లాలో సైనిక పాలన విధించినట్లు ఆర్మీ చీఫ్ వెల్లడి
- త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బంగ్లా ఆర్మీ చీఫ్
- దేశంలో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదు: బంగ్లా ఆర్మీ చీఫ్
- రాత్రిలోపు హింసను ఆపాలని బంగ్లాదేశ్ పౌరులకు ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి
- దేశంలో త్వరలో శాంతిని నెలకొల్పుతాం: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్
- బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై విచారణ ప్రారంభిస్తాం: ఆర్మీ చీఫ్
3.30 PM
షేక్ హసీనా రాజీనామా
బంగ్లాదేశ్‌లో అనిశ్చితి నెలకొన్నవేళ ప్రధాని షేక్ హసీనా చేసినట్లు ఆ దేశ మిలటరీ అధికారి తెలిపారు. దీంతో హసీనా 15ఏళ్ల పాలనకు తెరదించినట్లు అయింది. మరోవైపు, హసీనా ఢాకా నుంచి త్రిపుర వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు బంగాల్ వెళ్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Bangladesh Protests : హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతుండటం వల్ల ప్రధాని షేక్ హసీనా ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. రాజధాని ఢాకా నుంచి షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి ప్రధాని అధికారిక నివాసం నుంచి రహస్య ప్రాంతానికి వెళ్లినట్టు సమాచారం. అయితే బంగ్లాదేశ్ ప్రధానిగా షేగ్ హసీనా రాజీనామా చేసినట్లు స్థానిక ప్రైవేటు జమునా మీడియా సంస్థ పేర్కొంది. అనంతరం దేశం హెలికాప్టర్లో విడిచివెళ్లినట్లు తెలిపాయి. అయితే హసీనా రాజీనామా గురించి, ఢాకా దాటి వెళ్లడంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు బంగ్లాదేశ్‌లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఆదివారం బంగ్లాదేశ్‌లో జరిగిన భీకర ఘర్షణలలో 98 మంది మరణించడం వల్ల, ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఘర్షణల్లో ప్రామాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ సోమవారం బంగ్లాదేశ్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.