ETV Bharat / international

రగులుతున్న బంగ్లాదేశ్​- వెంటాడి, వేటాడి హసీనా పార్టీ నేతల ఊచకోత- హీరోను కూడా వదల్లేదు! - bangladesh crisis Updates - BANGLADESH CRISIS UPDATES

Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో నిరసనలు ఇంకా చల్లారడం లేదు. ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదలి వెళ్లారు. అయితే, నిరసనకారులు మాత్రం హసీనా పార్టీ అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నేతలను వేటాడి ఊచకోత కోస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో 20 మంది అవామీ లీగ్‌ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Bangladesh Crisis
Bangladesh Crisis (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 1:25 PM IST

Updated : Aug 7, 2024, 3:11 PM IST

Bangladesh Political Crisis : రిజర్వేషన్ల రద్దుకోసం జరిగిన హింసాకాండలో బంగ్లాదేశ్‌లో వందల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాజాగా ఈ నిరసన మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ నేతలకు మృత్యుపాశంగా తయారైంది. ఆందోళనకారులు అవామీ లీగ్‌ నేతలను వెంటాడి, వేటాడి ఊచకోత కోస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ అవామీ లీగ్ నేతల మృతదేహాలు లభ్యమవుతున్నాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం
తాజాగా బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా 29 మంది మృతదేహాలను గుర్తించారు. అందులో 20 అవామీ లీగ్‌ నేతలు ఉన్నట్లు మీడియా వెల్లడించింది. సాత్ఖిరా ప్రాంతంలో 10 మంది, కొమిల్లాలో 11 మంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అశోక్తలాలో ఒక మూక మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిప్పుపెట్టినట్లు తెలిపింది. ఇందులో ఐదుగురు టీనేజర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవదహనమయినట్లు తెలుస్తోంది. నటోరె ప్రాంతంలో ఆందోళన కారులు ఒక ఎంపీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ ఇంట్లోని పలు గదులు, బాల్కనీలు, పైభాగంలో తాజాగా మృతదేహాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సినీనటుడి హత్య
ఆదివారం నుంచి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు అవామీ లీగ్‌ పార్టీతో సంబధాలున్నవారిపై దాడులకు తెగబడుతున్నారు. వెంటాడి మరీ వారిని ఊచకోత కోశారు. సోమవారం సైతం ఈ దాడులు కొసాగాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారని తెలియగానే, నిరసన కారులు ఆమె మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో యువ నటుడు శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని నిరసనకారులు అతికిరాతకంగా చంపారు. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ బయోపిక్‌లో నటించారు.

24 మంది సజీవ దహనం
బంగ్లాదేశీ జానపద గాయకుడు రాహుల్‌ ఆనందోకు చెందిన నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారులు దాడి చేయగానే రాహుల్‌ కుటుంబం అక్కడినుంచి పారిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. జషోర్‌ జిల్లాలో అవామీలీగ్‌ నేతకు చెందిన హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మూడు వారాల ఆందోళనల్లో ఇప్పటి వరకు 440 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 109 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉంటే
రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహించనున్నారు. అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ - నోబెల్ గ్రహీత యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రకటన వెలువరించారు.

'దేశ వనరులు వృథా చేస్తున్నారు' - బంగ్లాదేశ్ అల్లర్లుపై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన! - Bangladesh Crisis

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్​ - Yunus as head of Bangladesh govt

Last Updated : Aug 7, 2024, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.