ETV Bharat / international

66వేల మంది భారతీయులకు అమెరికా సిటిజెన్​షిప్- ఆ లిస్ట్​లో​ రెండో దేశంగా ఇండియా - American Citizenship To Indians - AMERICAN CITIZENSHIP TO INDIANS

American Citizenship To Indians : అమెరికాలో అనేక మంది భారతీయులు అక్కడి పౌరులుగా మారిపోయారు. సహజీకృత పౌరసత్వం (Naturalisation Citizenship) కింద 2022లో దాదాపు 66,000 వేల మందికి ఆ హోదా లభించింది. ఈ పద్ధతిలో అమెరికా పౌరసత్వం పొందిన జాబితాలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాత ప్లేస్​లో భారత్‌ నిలిచింది.

American Citizenship To Indians
American Citizenship To Indians
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 9:37 AM IST

American Citizenship To Indians : అమెరికాలో స్థిరపడిన భారతీయులు అత్యధిక సంఖ్యలో అక్కడి పౌరసత్వం పొందారు. 2022లో సహజీకృత పౌరసత్వం (Naturalisation citizenship) కింద సుమారు 66,000 మంది అగ్రరాజ్య పౌరులయ్యారు. ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారిన జాబితాలో 1,28,878మంది పౌరులతో మెక్సికో మొదటి స్థానంలో నిలించింది. ఆ తర్వాత 65,960 మంది భారతీయులు అమెరికా సహజీకృత సిటిజన్‌షిప్‌ లభించింది.

అగ్రరాజ్యంలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. 33.3 కోట్ల యూఎస్​ జనాభాలో ఇది 14 శాతానికి సమానం. వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా (Naturalised citizens) పేర్కొన్నారు. మొత్తంగా 2022లో 9,69,380 మంది ఈ పద్ధతి ద్వారా అమెరికా పౌరులుగా మారారని ఇండిపెండెంట్ 'కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (CRS)' నివేదిక తెలిపింది.

అదే ఏడాదిలో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్‌ పౌరులుగా మారారు. తర్వాత భారత్ (65,960), ఫిలిప్పీన్స్‌ (53,413), క్యూబా (46,913), డొమినికన్‌ రిపబ్లిక్‌ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) ఉన్నాయి. అయితే, భారత్‌లో పుట్టి, అమెరికాలో ఉంటున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అగ్రరాజ్య పౌరసత్వం పొందే అర్హత లేదని సీఆర్‌ఎస్‌ నివేదిక వెల్లడించింది. 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్‌ పర్మినెంట్‌ రెసిడెన్సీ (LPR) ఉన్న 2,90,000 మంది భారతీయులు నాచురలైస్డ్​ సిటిజెన్​షిప్ పొందే అవకాశం ఉందని పేర్కొంది.

సహజీకృత పౌరసత్వం కోసం వచ్చే అప్లికేషన్ల సంఖ్య 2023 ముగిసే నాటికి 4,08,000గా ఉన్నట్లు సీఆర్‌ఎస్‌ నివేదిక పేర్కొంది. 2023లో కొత్తగా 8,23,702 మంది ఎల్‌పీఆర్‌ ఉన్నవారు నేచురలైజేషన్‌ కింద పౌరసత్వం కోసం ఆప్లై చేసుకున్నారు. దాదాపు 90 లక్షల మంది వరకు దానికి అర్హత ఉన్నప్పటికీ, చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయని నివేదిక వెల్లడించింది.

అగ్రరాజ్య సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. జన్మించిన దేశంతో పాటు కనీసం ఐదేళ్ల పాటు ఎల్‌పీఆర్‌లు అయ్యి ఉండాలి. హోండురస్‌, గ్వాటిమాలా, వెనిజువెలా, మెక్సికో, ఎల్‌ సాల్వెడార్‌, బ్రెజిల్‌ వారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వియత్నాం, ఫిలిప్పీన్స్‌, రష్యా, జమైకా, పాకిస్థాన్‌ వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.

భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!

ఇక అమెరికా వీసా మరింత భారం- హెచ్​1బీ సహా ఐదు కేటగిరీల ఫీజులు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.