ETV Bharat / international

'నిజ్జర్ కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదు'- కెనడాకు మద్దతుగా అమెరికా!

భారత్​పై కెనడా ఆరోపణలపై స్పందించిన అమెరికా- నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి

US on India Canada Issue
US on India Canada Issue (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 11:01 AM IST

US on India Canada Issue : సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు కెనడాకు భారత్ సహకరించడం లేదని అమెరికా ఆరోపించింది. భారత్​పై కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. వాటిని భారత్‌ తీవ్రంగా పరిగణించి కెనడాతో దర్యాప్తునకు సహకరించాలని యూఎస్ కోరుకుంటోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. కానీ, దిల్లీ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందని తెలిపారు. "భారత్- కెనడా దౌత్యవివాదంపై ఏమీ మాట్లాడను. కానీ భారత్​పై కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారత్‌ వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు కెనడాకు భారత్ సహకరించాలి. " అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో వ్యాఖ్యానించారు.

భారత ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాల ద్వారా కెనడా పౌరులపై దాడి చేయడానికి, సొంత గడ్డపైనే వారికి అరక్షిత వాతావరణం కల్పించడానికి తన దౌత్యవేత్తలను నియమించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు సహకరించలేదని విమర్శించారు. నిజ్జర్‌ హత్యకు సంబంధించి వివరాలను అమెరికాకు అందజేసినట్లు ఇటీవల మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా వ్యాఖ్యానించడం గమనార్హం.

'వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయి'
భారత్- కెనడా మధ్య ఘర్షణ వేళ కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్​జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ కెనడా పౌరులను సొంత గడ్డపై బెదిరించడం, వారికి హాని కలిగించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.

'సిక్కు సమాజం స్పందించాలి'
భారత్​పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు. కెనడా పౌరులపై హింసాత్మక దాడులకు పాల్పడిన భారత దౌత్యవేత్తల గురించి స్పందించాలని సిక్కు సమాజాన్ని కోరారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధిపతి మైక్ డుహెమ్. ఈ కేసు విచారణకు సంబంధించిన ఏదైనా విషయం తెలిస్తే తమకు చెప్పాలని కోరారు.

'భారత దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవాలి'
సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్యలో కొందరు భారతీయ దౌత్యవేత్తల ప్రమేయం ఉందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆరోపించిన మరుసటి రోజే న్యూ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షుడు జగ్మీగ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దౌత్యవేత్తలపై కఠినమైన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అలాగే కెనడా సహా ఇతర దేశాలలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్​పై నిషేధం విధించాలని కోరారు. కాగా, జగ్మీత్ సింగ్ గతంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇటీవలే ఆయన ట్రూడో సర్కార్​కు తన మద్దతును ఉపసంహరించుకున్నారు.

ట్రూడోది మళ్లీ పాత పాటే - ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు: భారత్

'ఆ హత్యలో భారత్​ పాత్ర - అదే విషయాన్ని అమెరికాకు చెప్పా' - జస్టిన్ ట్రూడో కవ్వింపు మాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.