Why Women Have More Depression : శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మందిని ఇబ్బంది పెడతున్న మానసిక సమస్య డిప్రెషన్. రోజువారీ పనులు, ఆహారపు అలవాట్లు, నిద్ర వంటి వాటితో పాటు మీ పనితీరు, ఇతరులతో ప్రవర్తనపై కూడా దీని ప్రభావం ఉంటుంది. డిప్రెషన్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. అయితే పురుషులతో పొల్చి చూస్తే స్త్రీలు రెండు రెట్లు ఎక్కువ డిప్రెషన్ అనుభవిస్తారట. ఎందుకంటే?
Why Do More Women Have Depression Than Men : సాధారణంగా పురుషుల కన్నా స్త్రీలు రెండింతలు ఎక్కువ డిప్రెషన్‌కు గురికావడానికి వారి కుటుంబ పరిస్థితులు, వృత్తి పరమైన సమస్యలు, వేతన వ్యత్యాసాల కారణం అవచ్చు. మహిళలు ఎప్పుడూ కఠినమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీటితో పాటు మహిళల్లో అధిక డిప్రెషన్ రేటుకు దోహదపడే అంశాలివే!
జీవ కారకాలు
మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా బుతుస్రావం, గర్భం, ప్రసవానంతరం వచ్చే మార్పులు స్త్రీలలో మానసిక కల్లోలం, నిరాశ, నిస్పృహ లక్షణాలను ప్రేరేపిస్తాయి. శారీరకంగా వారిలో కలిగే మార్పులకు వారు అలవాటు పడటానికి, వాటికి తగినట్టుగా మారడానికి మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. ఇది వారిలో డిప్రెషన్ పెంచుతుంది.
సామాజిక కారకాలు
ఇంటి బాధ్యతల నుంచి ఆఫీసులో పనుల వరకూ సామాజిక ఒత్తిళ్లు, స్త్రీలకు మాత్రమే కేటాయిస్తున్న కొన్ని పనుల కారణంగా మహిళలు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు. స్త్రీల ప్రవర్తన, పనులు ఇలానే ఉండాలి అని సమాజం పెట్టుకున్న కొన్ని ఆచారాలు, పద్దతులతో పాటు కుటుంబం కలిసి ఉండేలా చూసుకునే బాధ్యత తనపై వేయడం వంటి అంశాలు స్త్రీలను మరింత ఇబ్బంది పెడతాయి. అన్నింటినీ పూర్తి చేయాలి, అన్నీ సరిగ్గా చేయాలనే భారం మహిళల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తి డిప్రెషన్‌కు దారితీస్తాయి.
వేధింపులు
మహిళలు బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కోవడం. తర్వాత గృహ హింస వంటి ఇతర మానసిక సంక్షోభాల కారణంగా కూడా డిప్రెషన్‌కు లోనవుతారు. తర్వాత జీవితంలో కూడా నిరాశతో గడపటానికి ఇవి ముఖ్య కారకాలు అయి ఉండచ్చు.
మాససిక కారకాలు
మాతృత్వం, పిల్లల సంరక్షణ, వృత్తిపరమైన జీవతానికి సంబంధించిన డిమాండ్లు తరచుగా వీరిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయి. కుమార్తె, భార్య, తల్లి, కోడలు, సోదరి వంటి అన్ని పాత్రల్లో అందరినీ మెప్పించడానికి వీరిలో ఒత్తిళ్లు పెరుగుతాయి. కొన్నిసార్లు అసమర్ధత భావాలకు దారి తీసి డిప్రెషన్ లక్షణాలను పెంచుతాయి.
సామాజిక మద్ధతు
మహిళలకు బలమైన నెట్వర్క్ ఉన్నప్పటికీ ఇతరుల నుంచి వారు సహాయం కోరడం వంటివి వారిలో ఆందోళన, విచారం వంటి భావాలను పెంచి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. వారికున్న పరిమితులు కొన్ని వారిని ఆందోళనకు గురిచేసి దీర్ఘకాలికంగా డిప్రెషన్‌ను పెంచుతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా? మందులకు బదులు ఈ యోగాసనాలు ట్రై చేయండి! - Yoga For Constipation