ETV Bharat / health

నోరు లేదా ముక్కు నుంచి దుర్వాసన వస్తోందా? - ఈజీగా తగ్గించుకోండిలా! - Mouth Bad Breath Causes

Mouth Bad Breath Causes : చాలా మంది నోటి దుర్వాసన సమస్య ఎదుర్కొంటుంటారు. అలాగే అప్పుడప్పుడూ శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు నుంచి ఘాటైన వాసన అనుభవిస్తారు. మరి.. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా?

Bad Breath
Mouth Bad Breath Cause
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 1:34 PM IST

Why Mouth and Nose have Pungent Smell Sometimes : మన నోరు లేదా ముక్కు నుంచి చెడు వాసన రావడానికి గల కారణాన్ని ప్రముఖ బ్రిటీష్ డాక్టర్ ఎల్లీ కానన్ 'Daily Mail నివేదిక'లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మన చుట్టూ ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు తిరుగుతాయని, అందులో లెక్కలేనన్ని బ్యాక్టీరియాలు వివిధ సందర్భాల్లో నోటిలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. అలా ప్రవేశించిన సూక్ష్మజీవులు మన నోరు, ముక్కులోని లాలాజలం, ఎంజైమ్స్ మొదలైన శరీర వ్యవస్థల ద్వారా నాశనం అవుతాయి. ఫలితంగా మనం వివిధ వ్యాధుల నుంచి రక్షణ పొందుతామని చెబుతున్నారు డాక్టర్ ఎల్లీ కానన్.

అయితే.. మన బాడీలో ఇన్ని రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ.. కొన్ని రకాల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నోటి లోపలికి చొచ్చుకొని వెళతాయంటున్నారు వైద్యులు. అలా వెళ్లిన సూక్ష్మజీవులు మీ నోరు లేదా ముక్కు వంటి శరీర భాగాల వెనుక స్థిరపడుతాయంటున్నారు. ఆ తర్వాత వాటిలో కొన్ని చనిపోయినప్పుడు నోరు లేదా ముక్కు నుంచి దుర్వాసన వస్తుందని చెబుతున్నారు ఎల్లీ కానన్.

అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ముక్కు, గొంతు, టాన్సిల్స్, సైనస్‌లలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా కొన్నిసార్లు అది జలుబు, దగ్గుకు దారితీస్తుందంటున్నారు. 2020లో "జర్నల్ ఆఫ్ పీరియాడొంటాలజీ"లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియానే అని వెల్లడైంది.

నిద్రలో ఊపిరి పట్టేస్తోందా? ఇదే కారణం కావొచ్చు!

ఇక ముక్కు లేదా నోటి నుంచి ఘాటైన వస్తుంటే నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ ఎల్లీ కానన్ ఒక నేచరల్ చిట్కాను సూచిస్తున్నారు. అది ఫాలో అవ్వడం ద్వారా చాలా ఈజీగా ఈ సమస్య నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చంటున్నారు. ఆ చిట్కా ఏంటంటే.. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి పుక్కిలించడం. గొంతు, ముక్కు నుంచి దుర్వాసన వస్తుంటే వెంటనే ఈ చిట్కాను రోజుకి రెండు, మూడుసార్లు చేస్తే బ్యాడ్ స్మెల్ ఇట్టే మాయమవుతుందని చెబుతున్నారు డాక్టర్ ఎల్లీ కానన్. ఇక దీనిని ఫాలో అయిన తర్వాత కూడా వాసన వస్తుంటే యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. వైద్య సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. అంతేకాకుండా దుర్వాసన వస్తుంటే నోరు, ముక్కును శుభ్రం చేసుకోవడం ముఖ్యమంటున్నారు డాక్టర్ ఎల్లీ కానన్. ఇందుకోసం.. ఆవిరి పట్టడం వంటి ప్రక్రియను ఫాలో అవ్వడం మంచిది అంటున్నారు వైద్యులు. ఇది నోరు, ముక్కును శుభ్రపరుస్తుందని, ఎక్కడో దాగి ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని సూచిస్తున్నారు డాక్టర్ ఎల్లీ కానన్.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా ? ఈ హోమ్​మేడ్​ టిప్స్​తో రిలీఫ్​ పొందండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.