ETV Bharat / health

చంటిపిల్లలు రాత్రిపూట ఎందుకు నిద్రపోరో తెలుసా? ఇలా చేయడమే అందుకు కారణమట! - Why New Borns not Sleep at Night - WHY NEW BORNS NOT SLEEP AT NIGHT

Why New Borns not Sleep at Night : చంటిపిల్లలందరూ పగలంతా హాయిగా నిద్రపోయి.. రాత్రంతా మేల్కొని ఉండడం మీరందరు చూసే ఉంటారు. వీరి నిద్రవేళలు పెద్దవారికి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అసలు పసిపిల్లలు రాత్రిపూట ఎందుకు నిద్రపోరు? అందుకు గల కారణాలేంటి? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతాయి? వీటికి సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Reasons for New Borns not Sleep at Night
Why New Borns not Sleep at Night (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 30, 2024, 1:29 PM IST

Reasons for New Borns not Sleep at Night : పగలంతా అమ్మ పక్కనో, ఉయ్యాల్లోనో ఆదమరచి నిద్రపోయే పసిపిల్లలు.. రాత్రయ్యేసరికి హుషారుగా ఉంటారు. కాళ్లు, చేతులు కదుపుతూ ఉత్సాహంగా ఆడుకుంటారు. అర్ధరాత్రి దాటినా వారు నిద్రపోరు.. అమ్మను పడుకోనివ్వరు. దీంతో తల్లులకు నిద్ర కరవవుతుంది. రాత్రంతా పాపాయిని కనిపెట్టుకునే ఉండాల్సి రావడంతో మోహమంతా పీక్కుపోయినట్లు అవుతుంది. చాలినంత నిద్ర లేక కళ్ల కింద నల్లటి వలయాలూ వచ్చేస్తుంటాయి. అసలు, చంటిపిల్లలు (New Borns) రాత్రిపూట ఎందుకు పడుకోరు? అందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముఖం నిండా అమాయకత్వంతో, పెదవులపై విరిసివిరవని చిరునవ్వుతో ముద్దుగా ముగ్దమనోహరంగా కనిపించే పసిపాపలు.. రాత్రి పూట నిద్రపోకపోవడం వెనుక కొన్ని చిన్న చిన్న కారణాలు దాగి ఉన్నాయంటున్నారు పిల్లల వైద్యులు డాక్టర్ పి. షర్మిళ. అవేంటంటే..

ఓవర్ ఫీడింగ్ : రాత్రిపూట చంటిపిల్లలు నిద్రపోకపోవడానికి ఓవర్ ఫీడింగ్ ఒక కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు డాక్టర్ షర్మిళ. ఎందుకంటే.. రీఫ్లక్స్ కారణంగా పాలు ఎక్కువై వెనక్కివస్తుంటాయి. అప్పుడు వారి దృష్టంతా పాలను ఎంతసేపు కక్కకుండా ఉంచుకోవాలనే దానిపైనే ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు కక్కుతుంటారు లేదా మింగుకుంటూ ఉంటారు. దాంతో పిల్లలు సరిగ్గా నిద్రపోరు. ఇది డబ్బా పాలు తాగే పిల్ల​లో ఎక్కువగా ఉంటుందంటున్నారు.

అండర్ ఫీడింగ్ : పొట్టనిండా అవసరం మేర పాలు తాగకపోయినా, ఫుడ్ తినకపోయినా రాత్రిపూట చంటి పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉండవచ్చంటున్నారు డాక్టర్ షర్మిళ.

ఓవర్ స్టిమ్యులేషన్ : ఇది కూడా పసి పిల్లలు నైట్ టైమ్ త్వరగా నిద్రపోకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు. ఎందుకంటే.. ఈ రోజుల్లో పిల్లల్లో ఎక్కువగా మాట్లాడితే మైండ్​ బాగా డెవలప్ అవుతారని ఎక్కువగా మాట్లాడిస్తుంటారు పేరేంట్స్. ఇలాంటివి చేసినప్పుడు వారి మైండ్ స్లో డౌన్ అయి.. స్లీప్ మోడ్​లోకి వెళ్లకుండా ఆగిపోవచ్చు.

ఈ ఓవర్ స్టిమ్యులేషన్ మనుషులు ఇచ్చేది అవ్వొచ్చు. లేదంటే.. బ్యాక్​గ్రౌండ్ శబ్దాలు ఎక్కువగా ఉండొచ్చు. అంటే.. ఆడిటరీ స్టిమ్యులేషన్. అలాగే.. పిల్లలకు భయపడి కొందరు, తెలియక కొంతమంది రాత్రి సమయంలో ఫుల్ లైట్స్ వేసి ఉంచుతారు. అలా లైట్స్ వేయడం వల్ల విజువల్ స్టిమ్యులేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా కళ్లు, చెవులు, మనసు.. ఇలా ఏదో ఒకటి ఓవర్ స్టిమ్యులేట్ అవుతున్నా రాత్రిపూట చంటిపిల్లల్లో నిద్రకు ఆటంకం ఏర్పడుతుందంటున్నారు డాక్టర్ షర్మిళ.

అదేవిధంగా.. శిశువు కడుపులో ఉన్నప్పుడు తల్లి పగలంతా అటూ ఇటూ తిరగడం, ఏదో ఒక పని చేస్తుంటారు. అప్పుడు పొట్టలోని బిడ్డకు ఉమ్మనీరు అటూ ఇటూ ఊగుతూ హాయిగా ఊయలలో ఊగుతున్నట్లు అనిపించి కమ్మగా నిద్రపోతారు. అదే.. రాత్రి వేళలో తల్లి పడుకొని ఉంటుంది. అందుకే.. ఎలాంటి కదలిక లేకపోవడంతో రాత్రంతా మేల్కొని ఉంటారట. ఇలా తొమ్మిది నెలలపాటు తల్లి గర్భంలో గడుపుతారు. కాబట్టి.. ఈ పద్ధతి అలవాటై పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు చంటిపిల్లలు ఇదే పద్ధతి పాటిస్తుంటారని చెబుతున్నారు వైద్యులు.

పాపాయికి 3 నుంచి 4 నెలలు వచ్చాక.. పగలు, రాత్రి తేడాలు గుర్తించడం ఆరంభమయి రాత్రి పడుకోవడం, పగలు ఆడుకోవడం మొదలెడుతారట. కాబట్టి.. మొదటి 3, 4 నెలలు ఆ తేడాలు తెలియక.. శిశువులు ఇష్టమొచ్చినప్పుడు లేవడం, పడుకోవడం చేస్తుంటారని ఈ విషయాన్ని గమనించాలంటున్నారు పిల్లల వైద్యులు డాక్టర్ షర్మిళ. ఇది ప్రకృతి సహాజం. అంతేకానీ.. పిల్లల నిద్రను పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇవేకాకుండా.. పిల్లలకు నిద్రాభంగం కలిగించే విషయంలో కొన్నిసార్లు వ్యాధులు ఉండొచ్చంటున్నారు. అప్పుడు వెంటనే వైద్య పరీక్షల సహాయంతో వాటిని నిర్ధరించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

గర్భిణులు తినే ఆహారం పుట్టే పిల్లలకు ప్రమాదమా? - ఏం తింటే చిన్నారులు ఆరోగ్యంగా పుడతారో తెలుసా?

పిల్లల డైపర్ల వాడకంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.