ETV Bharat / health

చెవిలో ఏమైనా ఇరుక్కుందా? ఫస్ట్​ అసలేం చేయాలో తెలుసా? - What To Do If Something Enters Ear

What To Do If Something Enters Your Ear : పిల్లలు తమకు దొరికిన వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. ఏమీ తెలియనితనం కాబట్టి వస్తువులను ఎలా వాడాలో కూడా వారికి తెలియదు. దాంతో కొంతమంది పిల్లలు తమకు దొరికే పెన్నులు లేదా ఇతర వస్తువులను చెవిలో పెట్టుకుంటూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఏదైనా వస్తువు చెవిలో ఇరుక్కుంటే డాక్టర్​ను సంప్రదించేలోపు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

What To Do If Something Enters Your Ear
What To Do If Something Enters Your Ear
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 5:42 PM IST

What To Do If Something Enters Your Ear : చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంతో జాగ్రత్తలు పాటించాలి. ఆటవస్తువులను లేదా తమకు కనిపించే ఇతర వస్తువులను ఎలా వాడాలో పిల్లలకు తెలియదు. కాబట్టి వాటిని ప్రమాదకరంగా వాడే పరిస్థితి ఏర్పడవచ్చు. కొంతమంది పిల్లలు పెన్నులు లేదా క్యాపులు లేదా ఇతర వస్తువులను చెవిలో గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల ప్రమాదం తలెత్తవచ్చు.

చెవిలోకి ఏదైనా గుచ్చుకున్నప్పుడు రక్తస్రావం జరగడమే కాకుండా తీవ్రమైన నొప్పి కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో ఇది ఎంతో ప్రమాదంగా భావించాలి. పిల్లలు బయటకు చెప్పలేరు కాబట్టి ఆ నొప్పిని లేదా బాధను ఏడుపు రూపంలో వ్యక్తపరుస్తుంటారు. ఇలాగే పెద్దల్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చెవిలో ఏదైనా దూర్చినప్పుడు ప్రమాదవశాత్తు అది ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.

కొన్నిసార్లు నిద్రిస్తున్నప్పుడు చీమలు లేదంటే ఇతర చిన్న పరిమాణంలో ఉండే జీవులు లేదా వస్తువులు చెవిలోకి దూరవచ్చు. అవి చెవిలో నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడటమే కాకుండా మనకు కూడా ఇబ్బంది కలిగిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో డాక్టర్​ను సంప్రదించడం అత్యుత్తమం. అయితే డాక్టర్‎ను సంప్రదించేలోపు ప్రథమ చికిత్స కింద ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందా.

చెవిలో ఏవైనా ఇరుక్కున్నప్పుడు ఇలా చేయండి

  • చెవిలో అనుకోకుండా ఏదైనా ఇరుక్కున్నప్పుడు ముందుగా చేయాల్సిన పని తలను సాధ్యమైనంత వరకు కిందకు వంచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుంది. పుల్లలు లేదా ఇతర వస్తువులు చెవిలో ఇరుక్కొని, బయటకు కనిపిస్తున్నప్పుడు వాటిని మెల్లగా. జాగ్రత్తగా బయటకు తియ్యడానికి ప్రయత్నించాలి. బయటకు కనిపించనప్పుడు ఏదో ఒకటి పెట్టి ప్రయత్నించరాదు. అది మరింత లోతుకు పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు.
  • చీమలు లేదా ఇతర పురుగులు చెవిలో ఉంటే ఆలివ్ ఆయిల్​ లేదా బేబీ ఆయిల్​ను పోయాలి. ఇలా చేస్తే అవి చనిపోతాయి. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. చీమలు, పురుగులు కాకుండా వేరే వస్తువులు ఇరుక్కుంటే ఆయిల్​ పోయకూడదు. బయటకు కనిపించకుండా చెవిలో ఏదైనా ఇరుక్కున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సిగరెట్ తాగడం Vs పొగాకు నమలడం- ఏది ఎక్కువ డేంజర్​! నిపుణుల మాటేంటి!

హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? డిన్నర్​ టైమ్​లో ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​ అంటున్న నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.