What to Do After Eating Oily Food: ఆయిల్ ఫుడ్స్ తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో.. తిన్న తర్వాత కలిగించే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి.. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. తప్పక తిన్నారంటే.. ఆ వెంటనే ఈ పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
వాకింగ్: ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత చాలా మందికి హెవీగా అనిపిస్తుంది. దీంతో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే పొరపాటున కూడా ఇలా విశ్రాంతి తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు, భోజనం చేసిన తర్వాతా ఓ అరగంట పాటు మెల్లిగా వాకింగ్ చేయాలట. ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణమయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందంటున్నారు.
ఆశ్చర్యం: ఫ్యాటీ లివర్‌ను కాఫీతో కరిగించొచ్చట! - ఈ పరిశోధన మీకు తెలుసా? - Coffee is good for NAFLD
గోరువెచ్చని నీరు: ఆయిల్ ఫుడ్ తీసుకున్న కాసేపటి తర్వాత సరైన మోతాదులో గోరువెచ్చని నీటిని తాగాలని.. ఇలా నీటిని తాగినప్పుడే మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుందని అంటున్నారు. అలాకాకుండా నీటిని తక్కువ మోతాదులో తాగినప్పుడు.. చిన్న పేగు ఆహారంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని జీర్ణక్రియకు ఉపయోగించడం వల్ల మలబద్ధకానికి దారి తీస్తుందట. గోరువెచ్చని నీటిలో టీస్పూన్ వాము వేసుకుని తాగితే జీర్ణక్రియ మరింత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.
ఫైబర్ ఫుడ్: ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత 30 నిమిషాలు నడక, గోరువెచ్చని నీటితోపాటు ఫైబర్ అధికంగా కలిగినటువంటి పండ్లను తీసుకోవడం ఎంతో మంచిదని అంటున్నారు. ఇలా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీర భాగాలు వివిధ ప్రక్రియలను నిర్వహించడానికి అవసరమైన విటమిన్లను ఖనిజాలను అందించడంలో దోహదపడతాయట.
గ్రీన్ టీ: ఆయిలీ ఫుడ్స్ తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే గ్రీన్ టీ లో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ఆక్సిడేషన్ను సమతుల్యం చేయడానికి ఎంతో సహాయపడతాయి. 2016లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీలోని క్యాటెచిన్స్ కొవ్వు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలోని కొవ్వు స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని సూచిస్తుంది. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని ఫిజియాలజిస్ట్ ఆండ్రూ బ్రాడ్లీ హడ్సన్(A.B హడ్సన్) పాల్గొన్నారు. గ్రీన్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు.
అలర్ట్ : మందు తాగితే షుగర్ పెరుగుతుందా? - నిపుణుల సమాధానమిదే! - problems of diabetes drink alcohol
ప్రోబయోటిక్ ఫుడ్స్: ప్రోబయోటిక్స్‌తో గట్ ఆరోగ్యాన్ని పోషించడానికి కొద్దిగా జీలకర్రను తీసుకుని పెరుగులో కలిపి తీసుకోవాలని.. ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను నిరోధిస్తుందని చెబుతున్నారు. అలాగే సరైన పేగు కదలికకు కూడా సహాయపడుతుంది. పెరుగు ఒక ప్రోబయోటిక్. ఇది గట్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కళ్లు ఉప్పు వాడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా! - Amazing Benefits of crystal salt