What To Ask Doctor Consulting : ఒంట్లో నీరసంగా ఉన్నా, ఇతర ఏ ఆరోగ్య సమస్య ఏర్పడినా డాక్టర్ వద్దకు వెళ్తుంటాం. అయితే డాక్టర్లు బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు రోగులకు ఎక్కువ సమయం కేటాయించలేరు. ఇచ్చిన కాస్త సమయంలో డాక్టర్లకు మన అనారోగ్య సమస్యల గురించి చెప్పాలి. కానీ చాలామంది వైద్యుల వద్ద తమకున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకోలేరు. మరికొన్ని విషయాల మర్చిపోతుంటారు కూడా. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలో చూద్దాం.
వైద్యుల వద్ద తనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి రోగి చెప్పకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటిది జరగకూడదనుకుంటే వైద్యుడ్ని సంప్రదించే ముందు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఏ విషయాన్ని మర్చిపోకుండా వైద్యుడికి చెప్పగలగుతారు. అలాంటప్పుడే రోగికి తనకు ఉన్న అనారోగ్య సమస్యలు, అనుమానాల గురించి అతి తక్కువ సమయంలో వైద్యుడిని అడగగలరు.
వైద్యుడిని కలుస్తున్నారా? అయితే ఇలా చెయ్యండి
డాక్టర్‌ను కలవడానికి మీరు వెళ్లినప్పుడు ఏం అడగాలని అనుకుంటున్నారో దానిపై స్పష్టత తెచ్చుకోండి. మీరు అడగాలనుకున్న అన్ని ప్రశ్నలను ఒక పేపర్ మీద క్లుప్తంగా రాసుకోండి. అందులోనూ అతి ముఖ్యమైన వాటిని ముందుగా రాసిపెట్టుకోండి. ముందుగా అతి ముఖ్యమైన వాటి గురించి డాక్టర్‌ను అడగండి. ఆ తర్వాత మీ జాబితాలో ఉన్న మిగతా విషయాల గురించి వివరంగా వైద్యుడ్ని అడగండి.
గతంలో డాక్టర్‌ను సంప్రదించినప్పుడు, ప్రస్తుతానికి వచ్చిన మార్పులు ఏంటో గుర్తుపెట్టుకొని వాటిని వైద్యుడికి వివరించాలి. దీంతో వైద్యుడు తాను ఇచ్చిన ట్రీట్మెంట్ ఎంతమేర పనిచేసిందో అనే క్లారిటీకి వస్తారు. ముఖ్యంగా ఆకలి, బరువు, నిద్ర, చూపు, వినికిడి, నీరసం విషయాల్లో ఏవైనా మార్పులు జరిగితే వైద్యుడికి క్షుణ్నంగా చెప్పాలి. గతంలో రాసిన మందుల చీటీలను, రిపోర్టులను తప్పనిసరిగా రోగి తన వెంట తీసుకెళ్లి వైద్యుడికి చూపించాలి. వీలైనంత వరకు సన్నిహితులను తోడుగా తీసుకెళ్లండి. అత్యవసర చికిత్స చేయాల్సి వచ్చినా, ఆస్పత్రిలో చేరినా, పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినా తోడుగా ఉన్నవారు సాయపడతారు.
డాక్టర్లను సంప్రదించే సమయంలో దృష్టి మరల్చే వాటికి దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండడం బెటర్. చాలామంది ఫోన్ మాయలో పడి డాక్టర్‌తో సరిగ్గా తన సమస్యలను పంచుకోరు. అలాగే డాక్టర్ చెప్పిన విషయాలు ఏవైనా అర్థం కాకపోతే మరోసారి అడగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటపడకూడదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అతిగా మద్యం సేవిస్తున్నారా? అయితే మీ లివర్ డేంజర్లో ఉన్నట్లే!
క్రియాటినిన్ పెరిగితే కిడ్నీలు ఖతమే - ఇలా నేచురల్‌గా తగ్గించుకోండి!