What Should Not Eat with Eggs : మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఒక కోడిగుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే ప్రొటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే.. పొరపాటున కూడా కోడిగుడ్ల కాంబినేషన్‌తో కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ కోడిగుడ్లతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
నాన్‌వెజ్ :
చాలా మంది జనాలు చికెన్, మటన్, చేపల వంటి నాన్‌వెజ్ వంటకాలతో కలిపి గుడ్లను తింటారు. అయితే.. ఇలా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటి కాంబినేషన్స్‌తో ఎగ్స్ తినడం వల్ల కొంతమందిలో జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కొందరిలో అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని పేర్కొన్నారు. 2018లో 'డైజెస్టివ్ డిసీజెస్ జర్నల్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చేపలు, కోడిగుడ్లు కలిపి తిన్న కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ జియాంగ్ వాంగ్' పాల్గొన్నారు. చేపలు, గుడ్లు కలిపి తినడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కనిపించాయని ఆయన పేర్కొన్నారు.
అరటి పండ్లు :
కొంతమందికి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తినడం అలవాటు ఉంటుంది. అయితే, ఇలా కోడిగుడ్లను తిన్న వెంటనే అరటి పండ్లను తినకూడదట. ఎగ్స్ తిన్న ఒక గంట తర్వాత అరటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రెండూ కలిపి ఒకేసారి తినడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయని అంటున్నారు.
చాయ్ :
ఉదయాన్నే టీ తాగకుండా చాలా మంది ఉండలేరు. అయితే, బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తిన్న వెంటానే టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా రెండూ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
చక్కెర :
మనం కోడిగుడ్లను చక్కెరతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ చక్కెరతో కలిపి కోడిగుడ్లను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- కోడిగుడ్లు తిన్న తర్వాత సోయా పాలు కూడా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
- ఎగ్స్‌తో కలిపి చీజ్ తినడం వల్ల మన బాడీలో ప్రొటీన్ స్థాయిలు పెరుగుతాయట. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు విటమిన్ బి12 లోపం ఉందా? - ఇలా చేస్తే ఇట్టే భర్తీ అయిపోతుంది! - Vitamin B12 Rich Foods