How to Prevent Osteoporosis: సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతుంటాయి. చిన్న తనంలో కూడా కొన్ని రకాల ఎముకల వ్యాధులు తలెత్తుతాయి. అందులో బోలు ఎముకల వ్యాధి ఒకటి. అసలు ఈ వ్యాధి అంటే ఏమిటి..? ఏ వయసు వారికి వస్తుంది..? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
బోలు ఎముకల వ్యాధి: ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకల కణజాలం దెబ్బతిని.. వాటి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఎముకల్లో పగుళ్ల సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది సైలెంట్ కిల్లర్. ఎముకలు విరిగేంత వరకూ ఎలాంటి లక్షణాలూ లేకుండా ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది.
మానసిక ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దెబ్బ! - మీరు ఇవి తింటున్నారా?
ఎవరికొస్తుంది..: ఈ సమస్య వయసు పెరిగిన వారిలో, మెనోపాజ్‌లో ఉన్న మహిళలకి వచ్చే అవకాశం ఉంది. మగవారిలో వయసు పెరిగే కొద్దీ సమస్య ఉంటుంది. రెగ్యులర్‌గా పగుళ్లు, ముఖ్యంగా వెన్నెముక, మణికట్టు, తుంటి, ఇతర బరువు మోసే ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి.
వయసుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
బాల్యం : ఎముక ఆరోగ్యానికి బలమైన పునాది బాల్యం, కౌమారదశలో పడుతుంది. ఈ వయసులో పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, బలవర్ధకమైన ఆహారాలు, గింజలు వంటి కాల్షియం అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా.. సూర్యకాంతి నుంచి లభించే విటమిన్ డి.. కాల్షియం చాలా ముఖ్యం. ఈ వయసులో రన్నింగ్, స్పోర్ట్స్ వంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల ఎముకలు ధృడంగా అభివృద్ధి చెందుతాయి.
నిద్రలేమితో క్యాన్సర్ - డయాబెటిస్, హార్ట్ ఎటాక్ బోనస్! ఇంకా
యుక్త వయస్సు: యుక్త వయస్సులోకి ప్రవేశించినప్పుడు.. కాల్షియం కోసం సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. సరిపడా బరువు మెయింటైన్ చేసేందుకు వ్యాయామాలు, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఎక్సర్సైజస్ రెగ్యులర్‌గా చేయాలి. అలాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మానేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ అలవాట్లు ఎముక ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
మధ్య వయసు: మధ్య వయసులో హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా మెనోపాజ్‌లో ఉన్న మహిళల్లో, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనికి నివారణగా హార్మోన్లు బ్యాలెన్స్‌గా ఉంచుకునేందుకు సరిపడా ఆహారం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. అలానే డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం.
40 ఏళ్ల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే ఈ జబ్బులు గ్యారంటీ!
వృద్ధులు: ఇక ఈ సమస్య ఈ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏజ్‌లో ఎముకల బలాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఇందుకోసం చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకోని తగిన జాగ్రత్తలు తీసుకోవడం కీలకం.
ఇక చివరగా.. బోలు ఎముకల వ్యాధిని నివారించాలంటే.. బాల్యం నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాల ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
దగ్గు తీవ్రంగా వేధిస్తోందా? - అయితే అది 100 రోజుల దగ్గు కావొచ్చు!
మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!