ETV Bharat / health

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - అది "మంకీపాక్స్" కావొచ్చు! - Monkeypox Symptoms

author img

By ETV Bharat Health Team

Published : Aug 19, 2024, 12:27 PM IST

Updated : Aug 19, 2024, 2:47 PM IST

What Is Monkeypox: కరోనా మహమ్మారిని మర్చిపోకముందే ప్రపంచాన్ని భయపెట్టేలా మరో అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. అదే మంకీపాక్స్​. ఆఫ్రికా దేశాల్లో ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అసలు.. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలేంటి? తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

Monkeypox Symptoms
What Is Monkeypox (ETV Bharat)

Monkeypox Symptoms: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారే మంకీపాక్స్​. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు మన పక్క దేశమైన పాకిస్థాన్‌కు చేరింది. ఐరోపా ఖండంలోని స్వీడన్‌లోనూ తొలి కేసును గుర్తించారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అసలేమిటీ.. మంకీపాక్స్? దీన్ని తొలుత ఎక్కడ గుర్తించారు? ఇది ఎన్ని రకాలు? ఈ వ్యాధి లక్షణాలేంటి? ఎలా వ్యాపిస్తుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మంకీపాక్స్‌ అంటే ఏమిటి?: మంకీపాక్స్(Monkeypox) అనేది ఒక వైరల్‌ వ్యాధి. ఇదీ స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. ఈ వైరస్‌ సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే.. దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు.

మనుషుల్లో మొదటి కేసు ఎప్పుడు గుర్తించారంటే?: 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఈ వ్యాధి సోకింది. ముఖ్యంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా.. తొలిసారి 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. భారత్‌లోనూ 2022లో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో డబ్ల్యూహెచ్​ఓ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది.

మంకీపాక్స్ ఎన్ని రకాలంటే?: మంకీపాక్స్‌ను క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌), క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) అనే రెండు వేరియంట్లుగా వర్గీకరించారు. ఇందులో క్లాడ్‌-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలూ వస్తాయి. దీనిలో మరణాల రేటు 1-10శాతం వరకు ఉంది. ఇక క్లాడ్‌-2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే.

ఎలా వ్యాప్తి చెందుతుందంటే?: మంకీపాక్స్‌ నేరుగా తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే ఛాన్స్ ఉంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్‌ ప్రవేశించవచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. అదీ లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్రికాలో 18వేలకు చేరిన ఎంపాక్స్ కేసులు- వ్యాపారుల ఆందోళన- దిల్లీలో హైలెవెల్ మీటింగ్​!

ఎంపాక్స్ లక్షణాలివే..!: డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ఈ వైరస్‌ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం(WHO రిపోర్టు), గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి ఇమ్యూనిటీ పవర్​పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావొచ్చు.

దీని నుంచి ఎలా నివారించుకోవాలంటే?

  • మంకీపాక్స్‌ లాగా కనిపించే దద్దుర్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
  • అలాగే.. ఈ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సంబంధం ఉన్న బట్టలు, దుప్పట్లు లేదా ఇతర వస్తువులను తాకకుండా చూసుకోవాలి.
  • అదేవిధంగా ఎప్పటికప్పుడు సబ్బు నీటితో చేతులను శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి.
  • ఒకవేళ చేతులు కడుక్కోవడం అందుబాటులో లేకుంటే.. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని యూజ్ చేయాలి.
  • చివరగా దీని బారిన పడకుండా ఉండాలంటే ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మంకీపాక్సా? ఆటలమ్మా? గుర్తించడం ఎలా?

Last Updated : Aug 19, 2024, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.