ETV Bharat / health

పిల్లల మరణానికి కారణమవుతున్న 'చాందీపురా వైరస్' - ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్​ అవ్వాల్సిందే! - What Is Chandipura Virus - WHAT IS CHANDIPURA VIRUS

What Is Chandipura Virus : వర్షాకాలం పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే.. రకరకాల సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇవే కాదు.. ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తున్న 'చాందీపురా వైరస్' పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందట! పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Chandipura Virus Symptoms
What Is Chandipura Virus (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 2:17 PM IST

Chandipura Virus Symptoms : ప్రస్తుతం చిన్నపిల్లల్లో ఎక్కువగా సోకుతున్న "చాందీపురా వైరస్"​ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో 10-15 ఏళ్ల లోపున్న చిన్నారుల్లో ఎక్కువగా ప్రబలుతోన్న ఈ వైరస్‌ కారణంగా పలు మరణాలూ సంభవిస్తున్నాయని చెబుతున్నారు. అసలేంటి.. చాందీపురా వైరస్? దీని ప్రభావం పిల్లలపైనే ఎక్కుగా ఎందుకు ఉంటోంది? ఇది ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలేంటి? చిన్నారులు దీని బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న చాందీపురా వైరస్(Chandipura Virus).. కొత్తదేమి కాదు. 1965లోనే మహారాష్ట్రలోని చాందీపురా అనే ప్రాంతంలో తొలిసారి ఈ వైరస్​ను కనుగొన్నారు. అందుకే.. దీనికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. 2003-04 మధ్య కాలంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రబలిన ఈ వైరస్‌కు.. సుమారు 300 మంది చిన్నారులు బలైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రస్తుతం గుజరాత్​లో ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అక్కడ పదుల సంఖ్యలో దీని బారిన పడుతున్నారు. కొందరు ఈ వైరస్ తీవత్రకు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అంతేకాదు.. ఇటీవలే గుజరాత్‌కు చెందిన ఓ నాలుగేళ్ల బాలిక చాందీపురా వైరస్‌తో చనిపోయినట్లు పుణేలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’.. పాప రక్త నమూనాల్ని పరీక్షించి నిర్ధరించింది.

ఎలా వ్యాపిస్తుందంటే?: ఇది 'రబ్డోవిరిడె’ అనే వైరస్‌ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ 'శాండ్ ఫ్లై' అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపున్న పిల్లలు దీని బారిన పడే ముప్పు అధికమని చెబుతున్నారు. అందులోనూ ఇది పదేళ్ల లోపున్న పిల్లలకు సోకితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

అదే ప్రధాన కారణమా? చాందీపురా వైరస్ తీవ్రత.. చిన్న పిల్లల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడమేనట! పిల్లలు ఎదిగే క్రమంలో అప్పుడప్పుడే బలపడుతున్న రోగనిరోధక వ్యవస్థను ఈ వైరస్‌ దెబ్బతీసి వివిధ రకాల దుష్ప్రభావాల బారిన పడేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే, ఈ వైరస్‌ పెద్దల పైనా అరుదుగా ఎఫెక్ట్ చూపిస్తుందట. కాకపోతే పెద్దవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు, మరణాలు చాలా తక్కువగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు! :

  • విపరీతమైన తలనొప్పి
  • తీవ్రమైన జ్వరం
  • ఫిట్స్
  • వాంతులు

గందరగోళంగా, మగతగా అనిపించడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పై లక్షణాలతో పాటు సీరియస్ కేసుల్లో బాధితుడు కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంటుందంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్​మెంట్ అందిస్తే వేగంగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

2014లో "జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. చాందీపురా వైరస్ సోకిన చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పుణెలోని "నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ"కి చెందిన డాక్టర్ గోపాలకృష్ణ మూర్తి పాల్గొన్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైరస్‌ సోకాక బాధపడడం కంటే.. ముందే జాగ్రత్తపడడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పిల్లల్ని దీని బారిన పడకుండా చూసుకోవచ్చంటున్నారు.

  • ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా, చెత్త పేరుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ కీటకం నీటిపై వృద్ధి చెందే ఛాన్స్ ఎక్కువ.
  • అలాగే.. ఈ కీటకాలు కుట్టకుండా మార్కెట్లో ప్రత్యేకమైన క్రీమ్స్ లభిస్తుంటాయి. వాటిని పిల్లల స్కిన్​కి అప్లై చేయడం బెటర్. అదేవిధంగా శరీర భాగాలు కవరయ్యేలా పొడవాటి స్లీవ్స్‌ ఉన్న షర్ట్స్‌, ప్యాంట్స్‌ పిల్లలకు ధరింపజేయడం మంచిదని చెబుతున్నారు.
  • నిద్ర పోయినప్పుడు దోమలు, కీటకాలు కుట్టకుండా దోమతెరలు యూజ్ చేయాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా, చేతుల్ని శుభ్రంగా ఉంచుకునేలా చిన్నారుల్ని ప్రోత్సహించాలి.
  • పిల్లల్ని జంతువులు/పెట్స్‌కి దూరంగా ఉంచాలి. ఎందుకంటే.. శాండ్‌ ఫ్లై జంతువుల్ని కుట్టడం వల్ల.. వాటితో దగ్గరగా మెలిగినప్పుడు పిల్లలకూ ఈ వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.
  • చివరగా వీటన్నింటితో పాటు.. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్​ను పెంచేందుకు మంచి పోషకాహారం అందించడం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమూ చాలా అవసరమంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

కుక్క కరిస్తేనే కాదు- పిల్లి, కోతి వల్ల కూడా ర్యాబిస్ వైరస్ సోకడం పక్కా!

రాత్రి పూట జ్వరం తరచూ ఇబ్బంది పెడుతుందా? లైట్​ తీసుకోవద్దు- ఈ జాగ్రత్తలు మస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.